AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బేబీ జంపింగ్‌’.. ఓ మూఢ నమ్మకపు ఫెస్టివల్‌.. ఎక్కడంటే.!

దేవుడు, దయ్యం అనే నమ్మకాలు ప్రపంచమంతా ఉన్నాయి. దైవాన్ని ప్రార్థిస్తారు. దెయ్యాన్ని ద్వేషిస్తారు. దేవుడంటే ఎనలేని భక్తి. దయ్యమంటే తెలియని భయం. అందుకే దాన్ని తరిమేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు.

'బేబీ జంపింగ్‌'.. ఓ మూఢ నమ్మకపు ఫెస్టివల్‌.. ఎక్కడంటే.!
Ravi Kiran
|

Updated on: Jun 14, 2020 | 1:10 PM

Share

దేవుడు, దయ్యం అనే నమ్మకాలు ప్రపంచమంతా ఉన్నాయి. దైవాన్ని ప్రార్థిస్తారు. దెయ్యాన్ని ద్వేషిస్తారు. దేవుడంటే ఎనలేని భక్తి. దయ్యమంటే తెలియని భయం. అందుకే దాన్ని తరిమేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. దుష్టశక్తులను పారదోలడానికి ఎన్నో చేస్తారు. దయ్యమంటేనే చెడు. ఆ చెడు పసిపిల్లలకు అంటకూడదనీ, ఏ కీడు జరగకూడదనీ మనం తావీదులు కడతారు. చంటిపిల్లలకు దిష్టి తగలకుండా బుగ్గన చుక్క పెడతారు. ఇష్టదైవాలను ప్రార్థిస్తారు. చాలా మంది వీటిని మూఢనమ్మకాలుగా తీసిపారేస్తారు. ఛాదస్తమని కొట్టిపారేస్తారు.

ఆ మాటకొస్తే ఇలాంటి తర్కరహితమైన నమ్మకాలు ప్రపంచమంతటా ఉన్నాయి. అందరూ మనల్నే ఆడిపోసుకుంటారు కానీ… పిచ్చి నమ్మకాలు లేని చోటంటూ లేదు ఈ భూమ్మీద. స్పెయిన్‌నే తీసుకోండి.. అక్కడ దయ్యాలను తరిమికొట్టడానికి ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు ప్రజలు. 16వ శతాబ్దం నుంచి ప్రతి ఏటా జూన్‌ రెండో ఆదివారం నాడు ఈ సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. బేబీ జంపింగ్‌ పేరిట జరుపుకునే ఆ ఫెస్టివల్‌ కొంచెం ఆసక్తికరంగా, కొంచెం భయం కలిగించేట్టుగా ఉంటుంది. అప్పుడప్పుడు ప్రమాదాలకు కారణమూ అవుతుంటుంది. ఓ వ్యక్తితో సైతాన్‌ వేషాన్ని ధరింపచేస్తారు. అలా సైతాన్‌ వేషం వేసుకున్న వ్యక్తిని కొలాచోగా పిలుచుకుంటారు. అతడు వీధుల్లో పరుపులపై పడుకోబెట్టిన పిల్లల మీదుగా దూకుతాడు. ఇలా చేయడం వల్ల పిల్లలకు ప్రేతాత్మల నుంచి రక్షణ కలుగుతుందనేది వారి నమ్మకం. ఏడాదిలోపు పసిపిల్లలను మాత్రమే ఇలా పడుకోబెడతారు.

స్పెయిన్‌లోని క్యాస్ర్టిల్లో డి ముర్సియా గ్రామంలో జరుగుతుందీ ఫెస్టివల్‌.. సైతాన్‌ వేషాన్ని వేసుకునే వ్యక్తి పసుపు ..ఎరుపు దుస్తులను ధరిస్తాడు.. పిల్లల నుంచి దూకడం వల్ల వారిలోని దుష్టశక్తులు పారిపోతాయట! 1620 నుంచి ఈ తంతును నిర్వహిస్తున్నారు ప్రజలు.. పిల్లలకు ఎలాంటి పీడలు రాకూడదనే సదుద్దేశంతోనే ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆచారాలలో ఇది కూడా ఒకటి. ఈ ఆచారం ఎందుకు పుట్టిందో.. ఎలా పుట్టిందో తెలియదుగానీ.. నాలుగు శతాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగుతోంది.  బాలు