మూసీ నదిలో కనువిందు చేసిన ‘టోర్నడో’

తెలంగాణ ప్రాంతంలో కనిపించని అరుదైన దృశ్యం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజల్ని అబ్బురపరిచింది. వలిగొండ మండలం నెమలి కాల్వ నాగారం...

మూసీ నదిలో కనువిందు చేసిన 'టోర్నడో'
Follow us

|

Updated on: Jul 31, 2020 | 9:34 PM

Tornodo Seen Near Musi River : టోర్నడోలు మనకు పెద్దగా తెలియవు. అమెరికాలో ఎక్కువగా అల్లకల్లోలం సృష్టించే ఈ టోర్నడోలు మన దగ్గర ఈ మధ్యే కనిపిస్తున్నాయి. తాజాగా మన మూసి నది సమీపంలో కనిపించి కనువిందు చేసింది.

ముందెన్నడూ తెలంగాణ ప్రాంతంలో కనిపించని అరుదైన దృశ్యం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజల్ని అబ్బురపరిచింది. వలిగొండ మండలం నెమలి కాల్వ నాగారం గ్రామాల మధ్య మూసిపైన నీళ్ల సుడులు తిరుగుతూ ఆకాశంలోకి ఎగసిన దృశ్యం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆకాశంలోని మేఘాలు ఒక్కసారిగి చుట్టి ముట్టి చెరువులో సుడిగుండంలా తిరుగుతూ నింగికేగిసిన అరుదైన దృశ్యాలు అబ్బురపరిచాయి.

మామూలుగా సముద్ర తీరాల్లో ఇలాంటి ఘటనలు చేసుకుంటాయి. కానీ మూసి నది పైన ఇలాంటి దృశ్యం చోటుచేసుకోవడం ఆశ్చర్యకరం. ఈ గురువారం సాయంత్రం 6.30 నిమిషాలకు ఈ అపురూప దృశ్యం చోటుచేసుకుంది. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.