మోదీ ప్రమాణ స్వీకారానికి ప్రముఖ సెలబ్రిటీలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రముఖులతో రాష్ట్రపతి భవనంలో సందడి నెలకొంది. విదేశీ ప్రతినిధులు, క్రీడాకారులు, బాలీవుడ్ ప్రముఖులు, జాతీయ నేతలు, ఎంపీలతో సహా దాదాపు 8 వేలమందికి పైగా ఆహ్వానాలు వెళ్లాయి. ఇవాళ సాయత్రం ఏడు గంటలకు వరుసగా రెండోసారి భారత ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ, కుమారుడు అనంత్ అంబానీ కూడా రాష్ట్రపతి భవన్‌కు […]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రముఖులతో రాష్ట్రపతి భవనంలో సందడి నెలకొంది. విదేశీ ప్రతినిధులు, క్రీడాకారులు, బాలీవుడ్ ప్రముఖులు, జాతీయ నేతలు, ఎంపీలతో సహా దాదాపు 8 వేలమందికి పైగా ఆహ్వానాలు వెళ్లాయి. ఇవాళ సాయత్రం ఏడు గంటలకు వరుసగా రెండోసారి భారత ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ, కుమారుడు అనంత్ అంబానీ కూడా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా, గౌతమ్ ఆదానీ, లక్ష్మీ మిట్టల్ తదితర వ్యాపార దిగ్గజాలు కూడా మోదీ ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్లారు. ఇక బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్, కంగనా రనౌత్, షారుక్ ఖాన్, సంజయ్ లీలా బన్సాలీ, కరణ్ జోహార్, ఆనంద్ ఎల్ రాయ్, మధుర్ బండార్కర్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ తదితరులు ప్రధాని ప్రమాణ స్వీకారానికి వెళ్లిన వారిలో ఉన్నారు.