తిరుమల సమాచారం: నేడు కొన్ని గంటల పాటు శ్రీవారి దర్శనానికి బ్రేక్
తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ వరహా స్వామి ఆలయంలో ఇవాళ మహాసంప్రోక్షణ జరగనుంది. దీంతో శ్రీవారి దర్శనానికి కొన్ని గంటల పాటు బ్రేక్ ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వరహాస్వామి ఆలయంలో ఉదయం 11.07గం.నుంచి మధ్యాహ్నం 1.16గంటల వరకు కర్కాటక లగ్నంలో ఈ క్రతవు జరగనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఘంటానాదం, నిత్యకట్ల కైంకర్యాల్లో భాగంగా తోమాల, అర్చన, నైవేద్యం, రెండో గంట తదితర పూజాదికాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల […]

తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ వరహా స్వామి ఆలయంలో ఇవాళ మహాసంప్రోక్షణ జరగనుంది. దీంతో శ్రీవారి దర్శనానికి కొన్ని గంటల పాటు బ్రేక్ ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వరహాస్వామి ఆలయంలో ఉదయం 11.07గం.నుంచి మధ్యాహ్నం 1.16గంటల వరకు కర్కాటక లగ్నంలో ఈ క్రతవు జరగనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఘంటానాదం, నిత్యకట్ల కైంకర్యాల్లో భాగంగా తోమాల, అర్చన, నైవేద్యం, రెండో గంట తదితర పూజాదికాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయనున్నామని, భక్తులు గమనించాలని వారు కోరారు.