Tirumala News : వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఏడు కొండలవాడికి భారీ ఆదాయం..లాక్ డౌన్ తర్వాత ఇదే అత్యధికం

|

Dec 26, 2020 | 12:25 PM

తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వెంకన్న ఆలయంలో శుక్రవారం వైకుంఠ ద్వారాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే.  కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత‌్తలు పాటిస్తూ ఉదయం 8 గంటల నుంచి...

Tirumala News : వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఏడు కొండలవాడికి భారీ ఆదాయం..లాక్ డౌన్ తర్వాత ఇదే అత్యధికం
Tirumala News Today
Follow us on

తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వెంకన్న ఆలయంలో శుక్రవారం వైకుంఠ ద్వారాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే.  కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత‌్తలు పాటిస్తూ ఉదయం 8 గంటల నుంచి ప్రత్యేక, సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ కలిగిన భక్తులను దర్శనానికి టీటీడీ అనుమతించింది. ఈ క్రమంలో శుక్రవారం రోజున  శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.  భక్తులు శుక్రవారం సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.4.3కోట్లు ఆదాయం వచ్చినట్లు వెల్లడైంది.  లాక్ డౌన్ తరువాత స్వామి వారికి ఈ రేంజ్ ఆదాయం రావడం ఇదే ప్రథమం. డిసెంబర్ నెలలో ఇప్పటికే ఐదుసార్లు వెంకన్న హుండీ ఆదాయం రూ.3కోట్లు దాటింది. అదే సమయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారిని రికార్డు స్థాయిలో 42వేల వరకు భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల గిరులు భక్తుల రద్దీ పెరిగింది. ఇక గురువారం రోజున వెంకన్నను 31,475 మంది దర్శించుకున్నారు.  11,504 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.79 కోట్లు సమకూరింది.

Also Read : 

APSRTC : ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త యాప్..అన్ని సేవలు అందులోనే..బుక్​ చేసుకున్న బస్​ మిస్సయితే..నెక్ట్స్ సర్వీస్​లో వెళ్లొచ్చు

India corona cases : దేశంలో కొత్తగా 22,273 వైరస్ పాజిటివ్‌ కేసులు..మరణాల సంఖ్య, యాక్టీవ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి