కౌంటింగ్ కేంద్రాలకు మూడంచెల భద్రత..

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో 36 కేంద్రాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ప్రాంతాల్లో నాలుగంచెల భద్రతా చర్యలు చేపట్టారు. మొదటి దశ కౌంటింగ్ హాలు వద్ద సాయుధ బలగాలుంటాయి. ఓట్ల లెక్కింపుల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 35 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు మొత్తం 25,224 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ […]

కౌంటింగ్ కేంద్రాలకు మూడంచెల భద్రత..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 22, 2019 | 1:15 PM

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో 36 కేంద్రాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ప్రాంతాల్లో నాలుగంచెల భద్రతా చర్యలు చేపట్టారు. మొదటి దశ కౌంటింగ్ హాలు వద్ద సాయుధ బలగాలుంటాయి. ఓట్ల లెక్కింపుల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 35 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు మొత్తం 25,224 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు.

కాగా.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, సమస్యాత్మక కౌంటింగ్ కేంద్రాల దగ్గర నిఘా పర్యవేక్షణ కోసం 14 వేల 770 సీసీ కెమెరాలు, 68 డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర సీఆర్‌పీసీ 144, పోలీస్ యాక్ట్ 30 సెక్షన్ ఉదయం నుంచి అమల్లో ఉంటుంది. ఇక కౌంటింగ్ సెంటర్లకు వంద మీటర్ల దూరం వరకూ జన సమీకరణ, వాహనాల రాకపోకలపై నిషేదాజ్ఞలు విధించారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి తప్పనిసరి అని డీజీపీ తెలిపారు. ఆందోళనలు, అల్లర్లు చేసే అవకాశమున్న వారితో పాటు రౌడీషీటర్లను ముందస్తుగానే అదుపులోకి తీసుకుంటామన్నారు.