Tiger spotted: మహారాష్ట్ర సరిహద్దులోని ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసీ శివారులో పులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా మరో ఆవును చంపడంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. ఐదు రోజుల క్రితం కూడా గొల్లఘాట్ శివారులో సంచరించిన పులి ఒక ఆవును చంపింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ నుంచి తరచూ భీంపూర్ సరిహద్దులో పులులు సంచరిస్తున్నాయి. దీంతో ఏక్షణం ఏం జరుగుతుందనే భయంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.