AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ నుంచి తెలంగాణలోకి పెద్దపులి ఎంట్రీ.. ఈ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. నాలుగు రోజులుగా ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో తిరుగుతున్న పులి, తాజాగా తెలంగాణలోని అశ్వారావుపేట అడవుల్లోకి ప్రవేశించింది. రేడియో టెలీ ట్రాకర్ సిగ్నల్స్ ద్వారా అధికారులు కదలికలను గుర్తించారు. గిరిజన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవుల్లోకి వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఏపీ నుంచి తెలంగాణలోకి పెద్దపులి ఎంట్రీ.. ఈ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
Tiger In Ashwaraopet
Shaik Madar Saheb
|

Updated on: Nov 13, 2026 | 2:33 PM

Share

తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో తీవ్ర అలజడి సృష్టించిన పెద్దపులి, తన దిశను మార్చుకుని తెలంగాణలోకి ప్రవేశించింది. ఏపీలోని వేలేరుపాడు మండలంలోని తెల్లపల్లి అడవుల మీదుగా గురువారం ఉదయం తెలంగాణలోని అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి (గుమ్మడిపల్లి) బీట్ పరిధిలోని బచ్చువారిగూడెం సమీప అటవీ ప్రాంతంలోకి పెద్ద పులి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి మెడకు అమర్చిన రేడియో టెలీ ట్రాకర్ సిగ్నల్స్ ద్వారా ఈ కదలికలను నిర్ధారించారు. అయితే ఆ తర్వాత సిగ్నల్ నిలిచిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

నాలుగు రోజులుగా వేలేరుపాడు మండలంలో సంచరించిన పెద్దపులి గురువారం సాయంత్రం అశ్వారావుపేట మండలంలోకి ప్రవేశించిందని.. అశ్వారావుపేట ఎఫ్‌ఆర్వో మురళీకృష్ణ తెలిపారు. ఇది కావడిగుండ్ల, చెన్నాపురం మీదుగా గాండ్లగూడెం వైపు వెళ్తున్నట్లు తెలిపారు.

అటవీ అధికారుల హెచ్చరికలు:

పులి సంచరిస్తున్న ప్రాంతాల సమీపంలోని గిరిజన గ్రామాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ, పోలీసు అధికారులు సూచించారు. ఎవరూ అడవుల్లోకి వెళ్లవద్దని, పశువులను ఇళ్ల వద్దే ఉంచుకోవాలని హెచ్చరించారు. గ్రామాల్లో మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు అటవీశాఖ సిబ్బంది పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

సరిహద్దు ప్రాంత ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావద్దని, అధికారుల సూచనలు పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. పులి జాడ కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.

Follow Us