ప్రకాశం జిల్లాలో పులి పంజా, నాలుగు ఆవులు మృతి !

|

Nov 19, 2020 | 8:24 AM

ఇది చలికాలమా..? లేక పులి కాలమా..? అన్నట్లు తయారైంది పరిస్థితి. అడవులనుంచి బయటికొస్తున్న పులులను చూస్తుంటే.. పోయే కాలం అనుకోవాలేమో.

ప్రకాశం జిల్లాలో పులి పంజా, నాలుగు ఆవులు మృతి !
Follow us on

ఇది చలికాలమా..? లేక పులి కాలమా..? అన్నట్లు తయారైంది పరిస్థితి. అడవులనుంచి బయటికొస్తున్న పులులను చూస్తుంటే.. పోయే కాలం అనుకోవాలేమో. తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ మనిషిని చంపేసిన పులి… అక్కడి వాసులకు కంటిమీద నిద్రలేకుండా చేస్తోంది. ఇక మహబూబాబాద్‌ జిల్లాలో రెండు పులులు తిరుగుతుండడం కలకలం రేపుతోంది. ఇప్పుడు ప్రకాశం జిల్లా వంతు వచ్చింది.ఇక్కడ ఓ పులి నాలుగు ఆవులపై దాడి చేసింది.

ఈ ఘటన అర్ధవీడు మండలంలో జరిగింది. ఇటీవల రాత్రి సమయంలో ఆవులను అడవిలో మేతకోసం తీసుకెళ్లారు కాపరులు. తెల్లారేసరికల్లా నాలుగు ఆవులు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన కాపరులు బసినేపల్లి, వెలగలపాయ, పోతురాజుటూరు అటవీ ప్రాంతాల్లో గాలించగా.. చనిపోయి కనిపించాయి. వెంటనే పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్తులు. గతంలో ఇలానే తమ పశువులపై దాడులు చేసి పెద్దపులి చంపేసిందని చెబుతున్నారు. ఇప్పుడు మరోసారి తన క్రూరత్వాన్ని చూపిస్తోందని అంటున్నారు. అయితే గతంలో అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. పశువులు కోల్పోయిన కాపరులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read :

రైట్, రైట్.. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి ఆర్టీసీ అద్దె బస్సులు

పచ్చిచేపను కసకస కొరికి తినేసిన శ్రీలంక మాజీ మంత్రి..ఎందుకంటే ?