తెలంగాణలో మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు

తెలంగాణకు మరో వానగండం పొంచిఉంది. వాయవ్య బంగా‌ళా‌ఖాతంతోపాటు ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీ‌డనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

తెలంగాణలో మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు
Rains In Andhra

Updated on: Oct 04, 2020 | 11:55 AM

తెలంగాణకు మరో వానగండం పొంచిఉంది. వాయవ్య బంగా‌ళా‌ఖాతంతోపాటు ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీ‌డనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి అను‌బం‌ధంగా 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌న ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొన‌సా‌గు‌తు‌న్నది. దక్షిణ ఒడిశా ప్రాంతంలో 7.6 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వద్ద ఉప‌రి‌తల ఆవ‌ర్తనం ఏర్పడింది. ఈ మూడింటి ప్రభా‌వంతో రాష్ట్రంలో ఆది, సోమ, మంగ‌ళ‌వా‌రాల్లో అక్కడ‌క్కడ ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన ఓ మోస్తరు నుంచి తేలి‌క‌పాటి వర్షాలు కురు‌స్తా‌యని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కారి రాజా‌రావు తెలి‌పారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.