ప్రమాదావశాత్తు రిజర్వాయర్‌లో పడి ముగ్గురు బాలలు మృతి

|

Jun 18, 2020 | 11:23 PM

వరంగల్‌ జిల్లాలోని రిజర్వాయర్ ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. బీమారంలోని పుట్టలమ్మ రిజర్వాయర్‌లో ప్రమాదావశాత్తు పడి ముగ్గురు పిల్లలు మృత్యువాతపడ్డారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

ప్రమాదావశాత్తు రిజర్వాయర్‌లో పడి ముగ్గురు బాలలు మృతి
Follow us on

వరంగల్‌ జిల్లాలోని రిజర్వాయర్ ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. బీమారంలోని పుట్టలమ్మ రిజర్వాయర్‌లో ప్రమాదావశాత్తు పడి గురువారం ముగ్గురు పిల్లలు మృత్యువాతపడ్డారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
బీమారానికి చెందిన దొడ్డిపాటి మనివిత్ (11), దొడ్డిపాటి మహేష్ బాబు(14), మ్యూనికుంట్ల విష్ణు తేజ (14) ముగ్గురు బాలురు సైకిల్‌పై వెళ్లి పుట్టలమ్మ రిజర్వాయర్‌ వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో పడి పిల్లలు గల్లంతయ్యారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో కేయూసీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గజఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇద్దరు బాలల మృతదేహాలను వెలికి తీయగా.. మరో బాలుడి కోసం గాలిస్తున్నారు. అప్పటి వరకు సరదాగా గడిపిన పిల్లలు కానరాని లోకాలకు పోవడంపట్ల వారి తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. దీంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.