మన సీతాకోకచిలుకను గెలిపించండి

|

Sep 27, 2020 | 6:07 AM

మన సీతాకోకచిలుకకు జాతీయ స్థాయి గుర్తింపు లభించబోతోంది. వివిధ రాష్ట్రాల నుంచి రంగు రంగుల సీతాకోక చిలుకలు పోటీ పడుతున్నాయి. ప్రకృతి అందాలన్ని తమలోనే ఉన్నాయంటూ మురిసిపోతున్నాయి. ఆ అందాలను గుర్తించే బాధ్యత కూడా మనదే.

మన సీతాకోకచిలుకను గెలిపించండి
Follow us on

మన సీతాకోకచిలుకకు జాతీయ స్థాయి గుర్తింపు లభించబోతోంది. వివిధ రాష్ట్రాల నుంచి రంగు రంగుల సీతాకోక చిలుకలు పోటీ పడుతున్నాయి. ప్రకృతి అందాలన్ని తమలోనే ఉన్నాయంటూ మురిసిపోతున్నాయి. ఆ అందాలను గుర్తించే బాధ్యత కూడా మనదే. జాతీయ స్థాయి ఉత్తమ సీతాకోకచిలుకను ఎంపిక చేయడానికి జరుగుతోన్న ఫైనల్‌ పోటీలో మొత్తం 7 రకాలు ఎంపిక కాగా, వాటిలో పాపికొండల అభయారణ్యంలో ఉండే మూడు రకాల సీతాకోకచిలుకలు కూడా ఉన్నాయి.

2021 సంవత్సరానికి కొనసాగుతోన్న ఈ పోటీలో పశ్చిమగోదావరి జిల్లా పాపికొండల అభయారణ్యంలోని కామన్‌ జేజేబెల్, కామన్‌ నవాబ్, ఆరెంజ్‌ ఓకలీఫ్‌ అనే మూడు జాతులు ఎంపికయ్యాయి. ఉత్తమ సీతాకోకచిలుకను ఎంపిక చేసేందుకు ఆన్‌లైన్‌ ఓటింగ్‌ను ఏర్పాటు చేశారు. ‌ సెప్టెంబర్‌ 11వ తేదీ నుంచి ఆన్‌లైన్ ఓటింగ్ ప్రారంభమైంది. https://forms.gle/u7WgCuuGSYC9AgLG6 ఈ ట్యాగ్ లింక్ ద్వారా ఓటు వేయవచ్చు.

అక్టోబర్‌ 8 వరకూ ఆన్‌లైన్‌ ఓటింగ్‌ జరుగుతుంది. ఈ ఓటింగ్‌లో ఎవరైనా పాల్గొనవచ్చని వైల్డ్‌లైఫ్‌ డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారి సి.సెల్వమ్‌ తెలిపారు.