వేలాది దీపాల వెలుగులో కేదార్‌నాథ్‌ ఆలయం… కేదారీశ్వరుడిని దర్శనానికి తరలివస్తున్న భక్తులు

|

Nov 14, 2020 | 6:01 PM

గడ్డకట్టించే చలిలోనూ భక్తల ‘హర హర మహాదేవ’ నినాదాలతో కేదార్‌నాథ్ లయ ప్రాంగణంలో మారుమోగుతోంది.

వేలాది దీపాల వెలుగులో కేదార్‌నాథ్‌ ఆలయం... కేదారీశ్వరుడిని దర్శనానికి తరలివస్తున్న భక్తులు
Follow us on

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గడ్డకట్టించే చలిలోనూ భక్తల ‘హర హర మహాదేవ’ నినాదాలతో ఆలయ ప్రాంగణంలో మారుమోగుతోంది. నలుమూలల నుంచి తరలివచ్చిన అశేష భక్తుల భజనలతో కోలాహలం నెలకొంది. దీపావళి సందర్భంగా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు కేదార్‌నాథ్‌కు భారీగా తరలివస్తున్నారు. పండుగ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. గడ్డకట్టించే చలి, అధికంగా కురుస్తున్న మంచు కారణంగా నవంబరు 16 నుంచి కేదార్‌నాథ్ ఆలయాన్ని మూసివేయనున్నారు. ఇంతలోనే మహాదేవుడు కేదారీశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు కేదార్‌నాథ్ ఆలయానికి తరలివస్తున్నారు. మరోవైపు వేలాది దీపాలతో కేదార్‌నాథ్‌ ఆలయాన్ని అలంకరించారు ఆలయ సిబ్బంది.