దేశ వ్యాప్తంగానే కాకుండా.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా.. ‘దిశ’ హత్య కేసు హాట్ టాపిక్ అయ్యింది. ‘దిశ’ హత్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌తో.. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు పార్లమెంట్‌లో కూడా.. ఈ ఘటన.. పలు తీవ్రమైన చర్చలకు దారితీసింది. ఇప్పుడు తాజాగా.. మళ్లీ ‘నిర్భయ’ కేసు.. తెరపైకి వచ్చింది. వారికి శిక్ష ఎప్పుడు విధిస్తారంటూ.. ప్రశ్నల తాకిడి మొదలైంది. ఈ ఘటన జరిగి ఏడేళ్లు అయినా.. నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదు. తాజాగా.. నిర్భయ ఘటనకు సంబంధించి.. ఓ నిందితుడి క్షమాభిక్షను కూడా.. రద్దు చేశారు రాష్ట్రపతి. దీంతో.. వారికి ఎప్పుడు ఉరి పడుతుందా అంటూ.. అందరూ ఎదురు చూస్తున్నారు.
కాగా.. ‘దిశ’ హత్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించారు ఢిల్లీ మాజీ కమిషనర్ నీరజ్ కుమార్. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ.. అప్పడు నిర్భయ కేసును.. నేనే దగ్గరుండి పర్యవేక్షించానని.. ఆ సమయంలో.. నాకు ప్రజల నుంచి.. నిందితులకు తప్పకుండా ఉరిశిక్ష వేయాలని.. మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ విపరీతంగా వచ్చాయన్నారు. లేకుంటే ఎన్ కౌంటర్ చేయాలని.. బహిరంగంగా శిక్షించాలని కోరారు. కానీ.. మేము ఆ పనిని చేయలేకపోయాం. అలాగే.. ఇప్పుడు దిశ హత్యాచార కేసులో ఎన్‌కౌంటర్ సరైనదో.. కాదో.. న్యాయ ప్రక్రియ తేల్చాలి.. అదేంటో తెలుసుకోవాలని మాకు ఆసక్తిగా ఉందంటూ ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా.. ‘ద ఖాకీ ఫైల్స్’ పుస్తకంలో.. నీరజ్ కుమార్.. నిర్భయ కేసు దర్యాప్తు సమయంలో.. చాలా ఒత్తిడిలు వచ్చినట్టు చెప్పారు. నా ఇద్దరి కూతుళ్లను అత్యాచారం చేస్తామని బెదిరింపులతో పాటు.. నన్ను రాజీనామా చేయాలని డిమాండ్స్ వచ్చినట్లు ఆయన అందులో రాశారు.