ఆ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా ముప్పు తక్కువేనట.! సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు..

దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ పట్టి పీడిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూపోతోంది. ఈ తరుణంలో..

ఆ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా ముప్పు తక్కువేనట.! సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు..
Coronavirus.

Updated on: Apr 29, 2021 | 1:59 PM

దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ పట్టి పీడిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూపోతోంది. ఈ తరుణంలో వైరస్ బారినపడకుండా ఉండేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని.. దానికోసం పౌష్టికాహారం, అధికంగా చికెన్, మాంసం తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మాంసాహారులతో పోలిస్తే శాకాహారులకే కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. మరీ ముఖ్యంగా ‘ఓ’ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు కరోనా బారిన పడటం తక్కువ అని తాజా పరిశోధనల్లో తేలింది.

తాజాగా సీఎస్ఐఆర్ ఓ ప్యాన్ ఇండియా సెరో సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. సుమారు 10,427 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో యాంటీ బాడీల తీరును పరిశీలించగా.. శాకాహారుల్లో సెరో పాజిటివిటీ స్వల్పమేనని తేలినట్లు పరిశోధకులు చెబుతున్నారు.

ముఖ్యంగా పీచు పదార్ధం ఎక్కువగా తినే శాకాహారుల్లో కరోనాను ఎదుర్కునే రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అటు బీ, ఏబీ గ్రూప్ రక్తం ఉన్నవారిలో సెరో పాజిటివిటీ అధికంగా ఉందని.. ఈ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా రిస్క్ ఎక్కువగా ఉందని పరిశోధకులు తేల్చారు. అలాగే ‘ఓ’ బ్లడ్ గ్రూప్ వ్యక్తులకు కరోనాతో ముప్పు తక్కువేనని స్పష్టం చేసారు. కాగా, జనాల్లో యాంటీ బాడీలు తగ్గడం వల్లే కరోనా సెకండ్ వేవ్ లో పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని సీఎస్ఐఆర్ అభిప్రాయపడింది.

Read also: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?

ఈనెల 28 నుంచి జూన్‌ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..

 ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!

Follow Us