AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాషన్‌ వరల్డ్‌లో ఆమె ఒక సంచలనం..96 ఏళ్ల వయసులో మోడల్‌గా భారీ క్రేజ్!

మోడలింగ్..ఈ రంగంలో పైకి రావాలని చాలామంది అనుకుంటారు. కానీ ఫ్యాషన్ ఫీల్డ్‌లో ఇమడగలమో, లేదో అన్న భయం వెంటాడుతుంటుంది. ఏ పనిచేసినా ఆత్మవిశ్వాసం ఉంటే ఎంత కష్టతరమైన పని అయినా సరే..ఈజీగా చేసేయెచ్చు. అదే నిజం చేసి చూపిస్తుంది హాంకాంగ్‌‌కు చెందిన అలీస్‌‌ పాంగ్‌‌. ఆమె వయసు 96. ఇప్పుడు అక్కడి ఫ్యాషన్‌‌ ప్రపంచంలో ఈ భామ్మ ఓ సెన్సేషన్‌‌. అందుకు రీజనేంటో తెలుసా.. ఈ వయసులో కూడా ఆమె మోడలింగ్‌‌ చేయడమే. మనవరాలు ప్రోత్సాహంతో 93 […]

ఫ్యాషన్‌ వరల్డ్‌లో ఆమె ఒక సంచలనం..96 ఏళ్ల వయసులో మోడల్‌గా భారీ క్రేజ్!
Ram Naramaneni
|

Updated on: Sep 30, 2019 | 1:32 PM

Share

మోడలింగ్..ఈ రంగంలో పైకి రావాలని చాలామంది అనుకుంటారు. కానీ ఫ్యాషన్ ఫీల్డ్‌లో ఇమడగలమో, లేదో అన్న భయం వెంటాడుతుంటుంది. ఏ పనిచేసినా ఆత్మవిశ్వాసం ఉంటే ఎంత కష్టతరమైన పని అయినా సరే..ఈజీగా చేసేయెచ్చు. అదే నిజం చేసి చూపిస్తుంది హాంకాంగ్‌‌కు చెందిన అలీస్‌‌ పాంగ్‌‌. ఆమె వయసు 96. ఇప్పుడు అక్కడి ఫ్యాషన్‌‌ ప్రపంచంలో ఈ భామ్మ ఓ సెన్సేషన్‌‌. అందుకు రీజనేంటో తెలుసా.. ఈ వయసులో కూడా ఆమె మోడలింగ్‌‌ చేయడమే.

మనవరాలు ప్రోత్సాహంతో 93 ఏళ్ల వయసులో మోడల్‌గా:

అలీస్‌‌ పాంగ్‌‌‌కు మోడలవ్వాలనికానీ, ఫ్యాషన్ ఫీల్డ్‌లో రాణించాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ డెస్టినీ ఆమెను అటువైపు అడుగులు పడేలా చేసింది. వయసు ఎంత మీద పడుతున్నా..ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండటం, వస్త్రధారణ విషయంలో  లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో అవ్వడం వంటి అంశాలు ఆమె మనవరాలుని ఆకర్షించాయి.  మూడేళ్ల క్రితమే ఆన్‌‌లైన్‌‌ ప్రకటన చూసి అలైస్‌‌ను రోజూ గమనిస్తున్న మనవరాలికి  ఆన్‌‌లైన్‌‌లో చూసిన ఒక ప్రకటన ఉత్సాహాన్నిచ్చింది. 65 ఏళ్లు పైబడిన మోడల్‌‌ కావాలనేది ఆ యాడ్‌‌ సారాంశం. తన భామ్మలో అందుకు కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉన్నాయని భావించిన ఆ యంగ్ లేడీ.. అలైస్‌‌ ఫొటోల్ని ఏజెన్సీకి ఆన్‌‌లైన్‌‌లో పంపించింది. అప్పుడు ఆమె వయసు 93. ఆ ఫొటోలు చూసి ఇంప్రెస్‌‌ అయిన నిర్వాహకులు అలీస్‌‌ను ఫొటోషూట్‌‌కు పిలిచారు. మనవరాలి ప్రోత్సాహంతో అక్కడికెళ్లిన అలైస్‌‌ మొదటి షూట్‌‌లోనే మోడలింగ్‌‌ నిర్వాహకుల్ని ఆకట్టుకుంది. మోడలింగ్‌‌లో ఎలాంటి అనుభవం లేకపోయినా, తనలో ఉన్న సహజమైన అందంతో, యాటిట్యూడ్‌‌తో అందరినీ ఆకట్టుకుంది. అప్పట్నుంచి ఇప్పటివరకు కెరీర్‌‌‌‌లో వెనుదిరిగి చూడలేదు.

‘గుచ్చి, ఎల్లరీ, వాలెంటినో’ వంటి ఇంటర్నేషనల్‌‌ బ్రాండ్లకు మోడలింగ్‌‌ చేస్తోంది. ఆమె స్టిల్స్‌‌ చూస్తే ఈ వయసులో కూడా ఇంత స్టైలిష్‌‌గా ఉండొచ్చా అనిపిస్తుంది. రెగ్యులర్‌గా అందరు మోడల్స్ పాటించే డైట్ ఏది ఈ మెడల్ భామ్మ పాటించదు. పుడ్‌ గురించి, వర్కవుట్స్ గురించి అస్సలు ఆలోచించదు. తన ‘జీన్స్‌‌’వల్లే ఇంత అందంగా ఉన్నానని చెప్పింది. మోడల్స్‌‌ అనగానే కచ్చితంగా డైట్‌‌ ఫాలో కావాలి. రెగ్యులర్‌‌‌‌గా ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ చేయాలి. ఫ్యాట్‌‌ ఫుడ్‌‌ తినకూడదు. కానీ, అలైస్‌‌ మాత్రం ఇలాంటి రూల్స్‌‌ అస్సలు పాటించదు. తన ‘జీన్స్‌‌’వల్లే ఇంత అందంగా ఉన్నానని చెప్పింది. అలీస్‌‌కంటే తక్కువ వయసులో నోయా కుదో, వాంగ్‌‌ దేషన్‌‌ (84ఏళ్లు) లు మోడలింగ్‌‌లో రాణిస్తున్నారు.