పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులు, బ్రిటన్‌లో రెండు నెలల పాటు పూర్తి లాక్ డౌన్, ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటన.

బ్రిటన్ లో రెండు నెలల పాటు  పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఇది ఫిబ్రవరి వరకు ఉండవచ్చునని..

పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులు, బ్రిటన్‌లో   రెండు నెలల పాటు పూర్తి లాక్ డౌన్,  ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటన.
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 05, 2021 | 1:12 PM

UK LockDown:బ్రిటన్ లో రెండు నెలల పాటు  పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఇది ఫిబ్రవరి వరకు ఉండవచ్చునని, అయితే మరికొంతకాలం  పొడిగించినా పొడిగించవచ్ఛునని ఆయన చెప్పారు. స్కూళ్ళు, విద్యాసంస్థలు అన్నీ ఈ రెండు నెలలూ మూసి ఉంటాయన్నారు. ఒక్క ఇంగ్లండ్ లోనే సుమారు 44 మిలియన్ల మంది ఇక ఇళ్లకే పరిమితం కావలసి ఉంటుంది. మంగళవారం అర్ధ రాత్రి  నుంచి స్కాట్ లాండ్ లో. బుధవారం నుంచి ఇతర రాష్ట్రాల్లో పూర్తి లాక్ డౌన్ అమల్లో ఉంటుందని  బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. తాజాగా 27 వేలమంది కరోనా వైరస్ బారిన పడగా. మొన్న ఒక్కరోజే సుమారు 80 వేలమందికి పైగా ఈ వైరస్ పాజిటివ్ కి గురయ్యారని ఆయన చెప్పారు. ఇలా రోజురోజుకీ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో  స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ విధిస్తున్నామని, అత్యవసరమైన పనులమీద బయటికి వెళ్లాల్సి వస్తేనే ప్రజలు ఇళ్ళు వదలాలని జాన్సన్ పేర్కొన్నారు.

అయితే ఇప్పటికే బ్రిటన్ లో వేలాది మంది లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘిస్తున్నారు. బయట నిబంధనలకు పాతరేసి క్లబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నారు.వీరిని నియంత్రించడానికి పోలీసులు నానాపాట్లు పడుతున్నారు. కరోనా వైరస్ ఓ బూటకమని ఆసుపత్రుల ముందు నినాదాలు చేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది యువతీయువకులు ఉంటున్నారు.

Video Courtesy: MailOnline

Latest Articles
ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ
ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ
కేజీ చేపలు కేవలం రూ.10కే.. మంచి తరుణం మించిన దొరకదు
కేజీ చేపలు కేవలం రూ.10కే.. మంచి తరుణం మించిన దొరకదు
కూల్ వెదర్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న యువత
కూల్ వెదర్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న యువత
చెలరేగిన KKR బౌలర్లు.. కుప్పకూలిన SRH.. టార్గెట్ ఎంతంటే?
చెలరేగిన KKR బౌలర్లు.. కుప్పకూలిన SRH.. టార్గెట్ ఎంతంటే?
మీరు మొబైల్‌ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..
మీరు మొబైల్‌ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..
తొలుత 2 వేలు పెడితే అదిరే లాభం.. అందుకే 69 లక్షలు పెట్టాడు.. కానీ
తొలుత 2 వేలు పెడితే అదిరే లాభం.. అందుకే 69 లక్షలు పెట్టాడు.. కానీ
లండన్ వీధుల్లో.. లుంగీతో హల్‌చల్‌ చేసిన యువతి.. జనాల రియాక్షన్‌
లండన్ వీధుల్లో.. లుంగీతో హల్‌చల్‌ చేసిన యువతి.. జనాల రియాక్షన్‌
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో
ఆధ్యాత్మిక సందడిలో అలజడి.. హనుమాన్ ర్యాలీలో ఆగంతకుడి హల్ చల్..
ఆధ్యాత్మిక సందడిలో అలజడి.. హనుమాన్ ర్యాలీలో ఆగంతకుడి హల్ చల్..
గిన్నిస్ బుక్ లోకి ఆరు అడుగుల ‘రోమియో’! వీడియో చూస్తే అవాక్కే..
గిన్నిస్ బుక్ లోకి ఆరు అడుగుల ‘రోమియో’! వీడియో చూస్తే అవాక్కే..