Bird Flu In India: చికెన్‌, గుడ్లపై నిషేధం.. అప్రమత్తంగా ఉండాలని సూచించిన ప్రభుత్వం.

Sale Of Chicken, Egg, Fish Banned: కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక ముందే మరో వ్యాధి తన పంజా విసురుతోంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన బర్డ్‌ ఫ్లూ..

Bird Flu In India: చికెన్‌, గుడ్లపై నిషేధం.. అప్రమత్తంగా ఉండాలని సూచించిన ప్రభుత్వం.
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 05, 2021 | 10:23 AM

Sale Of Chicken, Egg, Fish Banned: కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక ముందే మరో వ్యాధి తన పంజా విసురుతోంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన బర్డ్‌ ఫ్లూ ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ క్రమంగా ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. ప్రస్తుతం ఈ కొత్త వైరస్‌ను రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఈ వైరస్‌ను గుర్తించారు. ఆయా రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో కాకులు, నెమళ్లు, బాతులు, కోళ్లు చనిపోతున్నాయి. దీంతో ప్రభుత్వాలు ముందస్తు చర్యలను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే కేరళలో వేలాది పక్షులను చంపేస్తున్నారు. ఇదిలా ఉంటే హిమచల్‌ ప్రభుత్వం బర్డ్‌ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చికెన్‌, గుడ్లు, చేపల విక్రయంపై నిషేధం విధించారు. ప్రజలకు కూడా బర్డ్‌ ఫ్లూ సోకే ప్రమాదం పొంచి ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇదిలా ఉంటే బర్డ్‌ ఫ్లూ కారణంగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న పాంగ్‌ డ్యామ్‌ లేక్‌లో వలస బాతులు బర్డ్‌ఫ్లూ బారిన పడ్డాయి. రాజస్థాన్‌లోనూ సోమవారం 170 వరకు పక్షులు మృతి చెందాయి.

Also Read: Bird Flu Confirmed : మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాలను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ వైరస్.. తాజాగా సౌత్ ఇండియాను తాకింది..