AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. అస్సలు లైట్ తీసుకోవద్దు.. డేంజర్ సమస్యలకు కారణం కావచ్చు

రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గాయనం మీరు చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఇది రక్తంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. మీకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తస్రావం ఎక్కువగా జరగకుండా నిరోధిస్తుంది.అయితే శరీరంలో వీటి కౌంట్ తగ్గితే మనకు చాలా ప్రమాదం. కాబట్టి ఈ సమస్య వచ్చినప్పుడు త్వరగా చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే శరీరంలో ప్లేట్‌లేట్స్ తగ్గినప్పుడు మనకు బాడీలో కనిపించే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. అస్సలు లైట్ తీసుకోవద్దు.. డేంజర్ సమస్యలకు కారణం కావచ్చు
Symptoms That Appear In Your Body When Platelet Count Decreases
Anand T
|

Updated on: Jan 15, 2026 | 8:07 PM

Share

శీతాకాల వాతావరణ ప్రభావంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యం చలికాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి చాలా వరకు తగ్గిపోతుంది. తద్వారా మనం త్వరగా అనారోగ్య సమస్యల భారీన పడుతాం. ఈ సమయంలో, కొంతమంది శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం ప్రారంభమవుతుంది.ఈ సమస్యని లైట్ తీసుకుంటే చాలా ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గితే, చిన్న గాయాలు కూడా తీవ్రంగా మారుతాయి. కాబట్టి, శరీరంలో ప్లేట్‌లెట్లు తగ్గడానికి కారణాలు ఏమిటి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం.

శీతాకాలంలో శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గడానికి కారణమేమిటి?

ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ వైద్య విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ గిరి ప్రకారం, చల్లని వాతావరణంలో, శరీర రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది, ఇది వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి సందర్భాలలో, శరీర రక్త వ్యవస్థ ప్రభావితమవుతుంది. దీంతో ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడం ప్రారంభమవుతుంది. శీతాకాలంలో, సూర్యరశ్మి లేకపోవడం, నీరు తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాలు రక్త ప్రసరణను ప్రభావితం చేస్తాయి. కొందరిలో, దీర్ఘకాలిక వ్యాధులు లేదా మందులను నిరంతరం వాడటం కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అదనంగా, పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వారు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు.

తక్కువ ప్లేట్‌లెట్స్ లక్షణాలు:

మన రక్తంలో ప్లేట్‌లెట్లు తక్కువగా ఉన్నప్పుడు, మీకు తరచుగా ముక్కు నుండి రక్తం కారడం, చిగుళ్ళ నుండి రక్తస్రావం లేదా మీ శరీరంపై నీలం-నలుపు మచ్చలు కనిపించవచ్చు. అలాగే మీకు చిన్న గాయం తగిలినా ఎక్కువ రక్తం పోతుంది. ఇదే కాదు నిరంతరం బలహీనత, అలసటగా అనిపంచడం, తలతిరుగుతున్నట్టు అనిపించడం కూడా శరీరంలో ప్లేట్‌లేట్స్ తగ్గడానికి కారణం కావచ్చు. మహిళల్లో, ఋతుస్రావం సమయంలో అధిక రక్తస్రావం కూడా తక్కువ ప్లేట్‌లెట్లకు సంకేతం కావచ్చు. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించకపోతే, పరిస్థితి తీవ్రంగా మారవచ్చు.

దీన్ని ఎలా నివారించాలి?

  • ఈ సమస్యలను తగ్గించుకోవడానికి సమతుల్య, పోషకమైన ఆహారం తీసుకోండి ముఖ్యం.
  • రోజూ గోరువెచ్చని నీరు త్రాగడం అలవాటు చేసుకోండి.
  • శీతాకాలంలో మార్నింగ్ లేచిన వెంటనే సూర్యకాంతిలో నిలబడడం చేయండి.
  • వైరల్ ఇన్ఫెక్షన్‌లు సోకకుండా జాగ్రత్తలు తీసుకోండి.
  • సమయానికి పడుకోండి. సరిగ్గా నిద్రపోవడం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోయేలా చేసుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.