Cleaning Hacks: షాక్ కొడుతుందనే భయం వద్దు.. స్విచ్‌బోర్డులను క్లీన్ చేసే ‘స్మార్ట్’ ట్రిక్స్ ఇవే!
ఇంటికి రంగులు వేసి, నీట్‌గా ఉంచినా.. అక్కడక్కడా నల్లగా మురికి పట్టిన స్విచ్‌బోర్డులు ఉంటే ఇంటి అందం దెబ్బతింటుంది. రోజూ చేతులతో తాకడం వల్ల వీటిపై జిడ్డు, మొండి మరకలు పేరుకుపోతాయి. నీళ్లతో శుభ్రం చేస్తే షాక్ కొడుతుందనే భయం ఉంటుంది. మరి సురక్షితంగా, నిమిషాల్లో స్విచ్‌బోర్డులను ఎలా క్లీన్ చేయాలో ఈ చిట్కాల ద్వారా తెలుసుకోండి. మీ చర్మాన్ని మెరిపించే చిట్కాల్లాగే, ఇవి మీ ఇంటి స్విచ్ బోర్డులను కూడా తడుముకోకుండా మెరిపిస్తాయి.

స్విచ్‌బోర్డులపై ఉండే జిడ్డు మరకలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్స్ అవసరం లేకుండానే.. నెయిల్ పాలిష్ రిమూవర్, టూత్‌పేస్ట్ వంటి వస్తువులతో వాటిని శుభ్రం చేయవచ్చు. మురికి పట్టిన బోర్డులను కొత్తవాటిలా మార్చే 4 సులభమైన పద్ధతులు మరియు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ కథనంలో మీకోసం.
శుభ్రం చేయడానికి ముందు తప్పనిసరిగా మెయిన్ పవర్ సప్లై ఆఫ్ చేయాలి. చేతులకు గ్లౌజులు లేదా కాళ్లకు చెప్పులు వేసుకోవడం మరింత సురక్షితం.
నెయిల్ పాలిష్ రిమూవర్: ఒక కాటన్ బాల్ లేదా మెత్తని గుడ్డపై కొంచెం నెయిల్ పాలిష్ రిమూవర్ వేసి స్విచ్‌బోర్డుపై తుడవండి. ఇది బోర్డుపై ఉన్న జిడ్డును, మొండి మరకలను తక్షణమే తొలగిస్తుంది.
వెనిగర్ నిమ్మరసం: వెనిగర్ మరియు నిమ్మరసం కలిపిన మిశ్రమం సహజమైన క్లీనర్‌గా పనిచేస్తుంది. పాత టూత్ బ్రష్ సహాయంతో ఈ మిశ్రమాన్ని బోర్డుపై రుద్దితే నల్లటి మరకలు మాయమవుతాయి.
షేవింగ్ క్రీమ్: వినడానికి వింతగా ఉన్నా.. షాపింగ్ క్రీమ్ మొండి మరకలను వదిలించడంలో చాలా ఉపయోగపడుతుంది. కొద్దిగా క్రీమ్ రాసి నిమిషం తర్వాత పొడి గుడ్డతో తుడిస్తే బోర్డు మెరిసిపోతుంది.
టూత్‌పేస్ట్: తెల్లటి టూత్‌పేస్ట్‌ను స్విచ్‌లపై రాసి, బ్రష్‌తో తేలికగా రుద్దండి. ఆ తర్వాత పొడి వస్త్రంతో తుడిచి చూడండి, స్విచ్‌బోర్డు కొత్త దానిలా కనిపిస్తుంది.
