ఏపీలో వీటికి నిధులు కేటాయించలేదు..
విభజన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు ఈ బడ్జెట్‌లో పలు విభాగాలకు ఒక్కరూపాయి కూడా కేటాయించలేదు. అసలే లోటు బడ్జెట్‌లో బాధపడుతున్న ఏపీని కేంద్రం ఆదుకుంటుందని భావించినప్పటికీ కేంద్రం మొండిచేయి చూపడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విభజన హామీల ప్రకారం కేటాయించిన ఐఐటీ, ఐఐఎం, నిట్, ఐఐఎస్ఈఆర్, ట్రీపుల్ ఐటీల ప్రస్తావనే లేకుండా పోయింది. దీనివల్ల వీటి భారమంతా రాష్ట్ర ప్రభుత్వానికి చుట్టుకునేలా ఉంది. ఇప్పటికే సెంట్రల్ యూనివర్సిటీకి రూ.13 కోట్లు, ఏపీ ట్రైబల్ వర్సిటీకి రూ.8 కోట్లు […]
విభజన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు ఈ బడ్జెట్‌లో పలు విభాగాలకు ఒక్కరూపాయి కూడా కేటాయించలేదు. అసలే లోటు బడ్జెట్‌లో బాధపడుతున్న ఏపీని కేంద్రం ఆదుకుంటుందని భావించినప్పటికీ కేంద్రం మొండిచేయి చూపడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విభజన హామీల ప్రకారం కేటాయించిన ఐఐటీ, ఐఐఎం, నిట్, ఐఐఎస్ఈఆర్, ట్రీపుల్ ఐటీల ప్రస్తావనే లేకుండా పోయింది. దీనివల్ల వీటి భారమంతా రాష్ట్ర ప్రభుత్వానికి చుట్టుకునేలా ఉంది.
ఇప్పటికే సెంట్రల్ యూనివర్సిటీకి రూ.13 కోట్లు, ఏపీ ట్రైబల్ వర్సిటీకి రూ.8 కోట్లు కేటాయించారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్ధిక లోటుతో సతమతమవుతోంది. ఈ పరిస్థితుల్లో సాంకేతిక విద్యా సంస్థల పట్ల కేంద్రం శీతకన్ను వేయడంతో వీటి నిర్వహణ మరింత భారంగా తయారయ్యేలా ఉంది.