కరోనా కంటే భయంకరమైన వ్యాధి రాబోతోందా..? భూతాపం పెరిగి.. ప్రాణం పోసుకుంటున్న ఏళ్లనాటి వైరస్ లు..!
కరోనా కరాళన్రుత్యం చేస్తోంది. ప్రపంచం మొత్తం టెన్షన్ పడుతోంది. ఐతే కరోనాను మించిన భయంకర వ్యాధి మరోటి రాబోతుందా..? హీట్ వేవ్ తో మంచు కరిగి భయంకరమైన వైరస్ లు ప్రాణం పోసుకోనున్నాయా..? ఎన్నో ఏళ్లనాటి

కరోనా కరాళన్రుత్యం చేస్తోంది. ప్రపంచం మొత్తం టెన్షన్ పడుతోంది. ఐతే కరోనాను మించిన భయంకర వ్యాధి మరోటి రాబోతుందా..? హీట్ వేవ్ తో మంచు కరిగి భయంకరమైన వైరస్ లు ప్రాణం పోసుకోనున్నాయా..? ఎన్నో ఏళ్లనాటి ఆంత్రాక్స్, టెటానస్ బ్యాక్టరీయాలు మళ్లీ ఎలా విజృంభించాయ్..? ఇంతకీ ఆ..డేంజర్ భూతం మానవాళికి పెనుముప్పుగా మారనుందా..? అంటే అవుననే సమాధానం వినిస్తోంది.
భూతాపం….మానవాళి మనుగడ ఇప్పుడు దీనిపై ఆధారపడి ఉంది. ప్రతియేటా ప్రపంచదేశాలు భూతాపాన్ని తగ్గించేందుకు సదస్సులు జరిపాయే తప్పా….తీసుకున్న చర్యలు చాలా తక్కువే. ఇప్పుడు ఆ భూతాపమే మరో భయంకర వ్యాధి రావడానికి కారణమవుతోందని తెలిసింది. 2016 సమ్మర్‌లో… యూరప్‌ని ఓ హీట్ వేవ్ ఢీకొట్టింది. దాని దెబ్బకు… ఉత్తరాన ఆర్కిటిక్‌లో భాగమైన సైబీరియాలో గడ్డకట్టిన మంచు కాస్తా కరిగిపోయింది. దాంతో కొన్నేళ్లుగా అక్కడ మంచులో గడ్డకట్టి ఉన్న బ్యాక్టీరియా ఒక్కసారిగా ప్రాణం పోసుకుంది. దాంతో ఆంత్రాక్స్ వ్యాపించింది. 1941లో ఓ రెయిన్ డీర్ చనిపోయి… మంచులో కూరుకుపోయి… గడ్డకట్టింది.
ఇప్పుడు ఆ బాడీ బయటపడటంతో… దాన్లో చిక్కుకున్న ఆంత్రాక్స్ బ్యాక్టీరియా… అక్కడి చుట్టుపక్కల నీటి పై పొరలో విస్తరించింది. ఆ తర్వాత దాదాపు 2వేల రెయిన్ డీర్లకు ఆంత్రాక్స్ వ్యాపించింది. ఆ తర్వాత సంచార జీవులుగా ఉన్న నెనెట్స్ జాతి ప్రజలకూ అది వ్యాపించింది. 2016లో 115 మందికి ఆంత్రాక్స్ రాగా… ఆగస్టులో 12 ఏళ్ల చిన్నారి చనిపోయాడు. కరోనా వైరస్ కూడా గబ్బిలమో, పామో, ఆలుగు లాంటి జంతువుల నుంచే మనుషులకు వ్యాపించిందనే అంచనా ఉంది. ప్రస్తుతం ఆర్కిటిక్ ప్రాంతంలో మిగతా ప్రపంచం కంటే రెట్టింపు స్థాయిలో వేడి పెరుగుతోంది. దీంతో అక్కడి గడ్డ కట్టిన మంచులో వేల ఏళ్లుగా రకరకాల బ్యాక్టీరియా, వైరస్‌లు తిరిగి ప్రాణం పోసుకునే ప్రమాదం కనిపిస్తోంది.
భవిష్యత్తులో కరోనా లాంటి భయంకర వైరస్‌లు దాడి చేస్తే… వాటిని ముందే అడ్డుకునేలా రకరకాల వ్యాక్సిన్‌లు తయారుచేసి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. స్మాల్‌పాక్స్‌కి ఆల్రెడీ వ్యాక్సిన్ ఉంది కాబట్టి… తిరిగి అది వ్యాపించినా దాన్ని ఈజీగా అడ్డుకోగలం. కానీ, కరోనా లాంటి వైరస్ ఏదైనా దాడి చేస్తే… ఎలా అడ్డుకోవాలన్నది ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్న ప్రశ్న. సైబీరియాలో ఆంత్రాక్స్ వచ్చిన తర్వాత… 2016 నుంచి ఇప్పటివరకూ 6 లక్షల రెయిన్ డీర్‌లకు ఏటా ఆంత్రాక్స్ రాకుండా వ్యాక్సిన్ ఇస్తూనే ఉన్నారు. నిద్రాణంలో ఉన్న వైరస్‌లు నిద్ర లేవకూడదంటే… ఈ ప్రపంచం మొత్తం భూతాపాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. అలాగే ల్యాబుల్లో మరింత లోతైన పరిశోధనలు చెయ్యాలి. ఆస్పత్రులను అప్‌డేట్, అప్‌గ్రేడ్ చేసుకోవాలి. వైద్యానికి నిధులు పెంచాలి. ఆరోగ్యంపై ప్రజలందరిలో అవగాహన పెంచాలి. ఇవన్నీ జరుపుకోకపోతే… భవిష్యత్తులో మరో కరోనా లాంటి వైరస్ దాడి చేసే ప్రమాదం లేకపోలేదు.