గుడికి వెళ్లిన సమయంలో భారీ దోపిడీ, కడప రాయలసీమ తాప విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉద్యోగుల కాలనీలో కలకలం

|

Dec 25, 2020 | 11:14 AM

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం రాయలసీమ తాప విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(ఆర్టీపీపీ) ఎంప్లాయిస్ కాలనీలో భారీ చోరీ జరిగింది...

గుడికి వెళ్లిన సమయంలో భారీ దోపిడీ,  కడప రాయలసీమ తాప విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉద్యోగుల కాలనీలో కలకలం
Follow us on

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం రాయలసీమ తాప విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(ఆర్టీపీపీ) ఎంప్లాయిస్ కాలనీలో భారీ చోరీ జరిగింది. ఉద్యోగి సుబ్రమణ్యం నివాసం ఉంటున్న ఎఫ్-525 ఇంట్లో తెల్లవారు జామున దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఈ చోరీలో 20 తులాలు బంగారు, నగదు 40 లక్షలు, 6 కేజీల వెండి దొంగలు దోచుకెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో సుబ్రమణ్యం దేవాలయానికి వెళ్లిన సందర్భంలో ఈ చోరీ జరిగినట్టు పేర్కొన్నారు. పోలీసులు ఘటానా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.