అసలు టార్గెట్ ‘దొరబాబు’ కాదట.. మరి ఆ రోజు రాత్రి ఏం జరిగింది!

విజయనగరంలో జరిగిన సెక్స్ రాకెట్ ఘటన తర్వాత జబర్దస్త్ కమెడియన్స్ దొరబాబు, పరదేశీ ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయారు. ప్రస్తుతం ఇదే టాలీవుడ్‌లో ట్రెండింగ్ టాపిక్‌ అయ్యింది. ఎక్కడలేని పుకార్లన్నీ.. ఇప్పుడు ఈ ఘటన చుట్టూ..

అసలు టార్గెట్ 'దొరబాబు' కాదట.. మరి ఆ రోజు రాత్రి ఏం జరిగింది!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 09, 2020 | 8:07 AM

విజయనగరంలో జరిగిన సెక్స్ రాకెట్ ఘటన తర్వాత జబర్దస్త్ కమెడియన్స్ దొరబాబు, పరదేశీ ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయారు. ప్రస్తుతం ఇదే టాలీవుడ్‌లో ట్రెండింగ్ టాపిక్‌ అయ్యింది. ఎక్కడలేని పుకార్లన్నీ.. ఇప్పుడు ఈ ఘటన చుట్టూ తిరుగుతున్నాయి. మళ్లీ వీరు జబర్దస్త్‌లోకి రారని.. లేదు లేదు.. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఆది తీసుకువస్తాడనీ.. పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే.. ఎమ్మెల్యే, జబర్దస్త్ రోజా కూడా ఈ ఘటనపై స్పందించారని, లేదని అనేక పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఏదేమైనా.. సెక్స్‌ రాకెట్లో వీరిద్దరూ దొరకడం.. వీరితోపాటు అటు జబర్దస్త్ పరువు కూడా తగ్గిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడు దొరబాబుకు సంబంధించి మరో వార్త హల్ చల్ అవుతోంది. నిజానికి ఆరో రోజు రాత్రి పోలీసులు.. దొరబాబులను పట్టుకోవడానికి రాలేదట. దొరబాబు వెళ్లిన ఫ్లాట్ పక్కన.. మరో ఫ్లాట్‌లో కొందరు పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం రావడంతో.. వాళ్లు రైడింగ్‌కి వెళ్లారట. అయితే అక్కడున్న ఓ అబ్బాయి.. పలానా ఫ్లాట్‌లో జబర్దస్త్ నటులు ఉన్నారని చెప్పడంతో.. ఆ ఫ్లాట్‌కి వెళ్లారట పోలీసులు. ఇక డోర్ ఓపెన్ చేస్తే.. అక్కడ వ్యభిచారం జరుగుతుండంతో సీన్ అంతా రివర్స్ అయిపోయింది. వీళ్ల గ్రహచారం బాగోక.. అనుకోకుండా పోలీసులకు పట్టుబడ్డారు పరదేశీ, దొరబాబులు.

కాగా ఈ ఘటనపై వీరి కుటుంబసభ్యులు కూడా స్పందిస్తున్నారు. వారు అలాంటి వారు కాదని.. ఎవరో చెప్పిన మాటలు విని.. అక్కడికి వెళ్లినట్లు వారు చెబుతున్నారు. ఏదేమైనా.. ఈ ఘనటతో.. అటు ప్రొఫెషనల్‌గానే కాకుండా.. ఇటు జీవితంలోనూ ఈ ఘటనతో వీరి జీవితంలో ఛేదు జ్ఞాపకంగా మారిపోయిందనడంలో సందేహం లేదు.

ఇది కూడా చదవండి: పబ్‌లో జరిగిన దాడిపై రాహుల్ తల్లి ఏమన్నారంటే!