విదేశాల్లో డాక్టర్ కోర్సు చదువుకోవాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. అంక్షలు సడలించిన జాతీయ వైద్య కమిషన్

|

Jan 21, 2021 | 3:56 PM

ఎన్‌ఎంసీ ప్రకటించిన నిర్ణయం మేరకు ప్రపంచంలోని ఏ వైద్య కళాశాలలోనైనా విద్యార్థులు చదవుకోవచ్చు.

విదేశాల్లో డాక్టర్ కోర్సు చదువుకోవాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. అంక్షలు సడలించిన జాతీయ వైద్య కమిషన్
Follow us on

medical study abroad colleges : విదేశాల్లో వైద్య కళాశాలల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ప్రస్తుతం ఉన్న ఆంక్షలను జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తొలగించింది. ఇప్పటివరకు విదేశాల్లో వైద్య విద్య చదవాలంటే ఎంసీఐ ప్రకటించిన జాబితాలో సంబంధిత కళాశాల ఉంటేనే ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉండేది. తాజాగా ఎన్‌ఎంసీ ప్రకటించిన నిర్ణయం మేరకు ప్రపంచంలోని ఏ వైద్య కళాశాలలోనైనా విద్యార్థులు చదవుకోవచ్చు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో కోరుకున్న చోట డాక్టర్ కోర్సు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

అయితే, ఈ కళాశాలలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణికాలకు అనుగుణంగా ఏర్పాటై ఉండాలని సూచించింది. అలాగే, ఆయా దేశాల్లోని వైద్య కళాశాలల గుర్తింపు, ఫీజులు, ఇతర సమాచారాన్ని అనుసరించి విద్యార్థులు నిర్ణయం తీసుకోవాలని ఎన్‌ఎంసీ పేర్కొంది. దీనివల్ల విశ్వవిద్యాలయాలు, కళాశాలల మధ్య పోటీ పెరిగి.. ఫీజులు తగ్గే అవకాశాలు ఉంటాయని భావిస్తోంది. వైద్య విద్యలో నాణ్యత పెరిగేందుకు వీలుందంటున్నారు నిపుణులు.

Read Also… వికారాబాద్ జిల్లాలో దారుణం.. తల్లి చేయి పట్టుకున్నాడని ఓ యువకుడి ఘాతుకం.. కత్తితో దాడి.. ఓ వ్యక్తి మృతి