Anasuya Bharadwaj: అనసూయ బర్త్ డే స్పెషల్.. ‘వాంటెడ్ పండుగాడ్’ నుంచి ఫస్ట్ లుక్

|

May 15, 2022 | 6:53 PM

అందాల భామ అనసూయ(Anasuya Bharadwaj)... అటు బుల్లితెరపైన.. ఇటు వెండి తెరపైన తనదైన మార్క్ తో దూసుకుపోతోంది. హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలో నటించిన అనసూయ తాజాగా మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ..

Anasuya Bharadwaj: అనసూయ బర్త్ డే స్పెషల్.. ‘వాంటెడ్ పండుగాడ్’ నుంచి ఫస్ట్ లుక్
Anasuya
Follow us on

అందాల భామ అనసూయ(Anasuya Bharadwaj)… అటు బుల్లితెరపైన.. ఇటు వెండి తెరపైన తనదైన మార్క్ తో దూసుకుపోతోంది. హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలో నటించిన అనసూయ తాజాగా మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు.. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా తెరకెక్కుతోన్న సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’. దీనికి ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్.   శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా ఈ  చిత్రని తెరకెక్కిస్తున్నారు .  నేడు (ఆదివారం) అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి అనసూయ ఫ‌స్ట్ లుక్‌తో పాటు వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ ‘‘శ్రీధర్ సీపానగారి దర్శకత్వంలో హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉంటుంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మారేడుమిల్లిలో పెద్ద షెడ్యూల్‌ను పూర్తి చేశాం. త‌ర్వాత హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో కొంత షూటింగ్ చేశాం. సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది. మూడు, నాలుగు రోజులు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Udhayanidhi Stalin: తమిళ హీరో షాకింగ్‌ నిర్ణయం.. సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న స్టాలిన్‌!

Karate Kalyani: కరాటే కళ్యాణిపై మరో కేసు నమోదు.. ఆ విషయంలో బాధితుడు ఫిర్యాదు చేయడంతో..

Akshay Kumar: అక్షయ్‌కుమార్‌కి రెండోసారి కరోనా పాజిటివ్‌.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి దూరం..