కరోనా ఆంక్షలకు అనుగుణంగా సిరిమానోత్సవ వేడుకలు

|

Sep 11, 2020 | 3:36 PM

విజయనగరం జిల్లాలో ఎంతో ప్రతిష్టత్మకంగా నిర్వహించే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ తేదీలను ప్రకటించారు. అక్టోబర్ నెలలో ప్రారంభ‌మ‌య్యే ఉత్స‌వాలు నెల రోజుల పాటు నిర్వ‌హిస్తారు. అక్టోబ‌ర్ 2న మండల దీక్ష ప్రారంభం కాగా, అదేరోజు పందిరిరాట..

కరోనా ఆంక్షలకు అనుగుణంగా సిరిమానోత్సవ వేడుకలు
Follow us on

విజయనగరం జిల్లాలో ఎంతో ప్రతిష్టత్మకంగా నిర్వహించే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ తేదీలను ప్రకటించారు. అక్టోబర్ నెలలో ప్రారంభ‌మ‌య్యే ఉత్స‌వాలు నెల రోజుల పాటు నిర్వ‌హిస్తారు. అక్టోబ‌ర్ 2న మండల దీక్ష ప్రారంభం కాగా, అదేరోజు పందిరిరాట ఉంటుంది. 22న అర్థ‌మండ‌ల దీక్ష‌, 26న తోలేళ్ల ఉత్స‌వం, 27న సిరిమానోత్స‌వ వేడుక‌లు వైభవంగా నిర్వ‌హించ‌నున్నారు. న‌వంబ‌రు 3న తెప్పోత్సవంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయ‌ని ఈ దేవస్థానం ఈవో ప్రకటించారు. కరోనా ఆంక్షలకు  అనుగుణంగా ఉత్స‌వాల నిర్వాహ‌ణ ఉంటుంద‌ని వెల్లడించారు.

ఆల‌య ప్రాంగ‌ణంలో మాస్క్, సమాజిక దూరంను తప్పనిసరిగా పాటించాలని భక్తులకు ఆయన విఙ్ఞ‌ప్తి చేశారు. అమ్మవారి సిరిమాను చెట్టు గుర్తింపు వంటి ప్రక్రియ సైతం నిబంధనల మేరకే కొనసాగుతుందని తెలిపారు. వృద్దులు, చిన్నారులు, గర్బిణీలకు ప్రత్యేక దర్శనాలకు అనుమతి లేదని అన్నారు.

అయితే ఎంత‌మంది భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించాల‌న్న‌ది ఇంకా నిర్ణయం లేదని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు జిల్లాలో గల మూడు రథాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామ‌ని అన్నారు.