
భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఈ తీవ్రత ఈ రోజు, రేపు కూడా కొనసాగనుందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు బయటకు రాకపోవడమే మంచిదని వారు చెబుతున్నారు. కాగా భానుడి ప్రతాపానికి గురువారం ఒక్కరోజులోనే 16మంది ప్రాణాలు కోల్పోయారు.