సింగరేణిలో సమ్మె సైరన్..!

| Edited By: Pardhasaradhi Peri

Sep 23, 2019 | 8:45 PM

సింగరేణి సంస్థలో సమ్మె సైరన్ మోగనుంది. బొగ్గు పరిశ్రమల్లో విదేశీ ప్రత్యక్షపెట్టుబడులను వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా మంగళవారం జరగనున్న సమ్మెను, సింగరేణిలో కూడా సక్సెస్ చేసేలా కార్మికులను సమాయత్తం చేశాయి కార్మిక సంఘాలు. జాతీయ కార్మిక సంఘాలు చేపడుతున్న ఈ సమ్మెకు.. సింగరేణి గుర్తింపు సంఘంతో సహా విప్లవ కార్మిక సంఘాలు, పౌర హక్కుల సంఘాలు కూడా సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారం జరిగే దేశవ్యాప్త సమ్మె, సింగరేణిలో […]

సింగరేణిలో సమ్మె సైరన్..!
Follow us on

సింగరేణి సంస్థలో సమ్మె సైరన్ మోగనుంది. బొగ్గు పరిశ్రమల్లో విదేశీ ప్రత్యక్షపెట్టుబడులను వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా మంగళవారం జరగనున్న సమ్మెను, సింగరేణిలో కూడా సక్సెస్ చేసేలా కార్మికులను సమాయత్తం చేశాయి కార్మిక సంఘాలు. జాతీయ కార్మిక సంఘాలు చేపడుతున్న ఈ సమ్మెకు.. సింగరేణి గుర్తింపు సంఘంతో సహా విప్లవ కార్మిక సంఘాలు, పౌర హక్కుల సంఘాలు కూడా సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారం జరిగే దేశవ్యాప్త సమ్మె, సింగరేణిలో కూడా జరగనుంది. ఒక్కరోజు సమ్మె కారణంగా, రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడి, సింగరేణి సంస్థకు రూ. 70 కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే వేతనాల్లో కొత పడినా.. సంస్థ మనుగడకోసం, హక్కుల భద్రత కోసం దేశ వ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయాల్సిన బాధ్యత.. ప్రతీ కార్మికునిపై ఉందని.. జాతీయ కార్మిక సంఘాటు సింగరేణి కార్మిక సంఘాలకు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సింగరేణిలో సమ్మె జరగుతుందా.. లేదా అన్నది ఆసక్తిగా మారింది.