నిర్మల్‌లో ‘బాల భీముడు’.. ఐదున్నర కిలోలతో జననం

నిర్మల్ జిల్లాలో ఓ మహిళకు మంగళవారం జరిగిన ప్రసవంలో ఐదున్నర కిలోలు ఉన్న బాల భీముడు జన్మించాడు. అత‌డిని చూసి ఆశ్చ‌ర్య‌పోయిన వైద్యులు... ఇది చాలా అరుదైన ఘటనగా అభివ‌ర్ణించారు.

నిర్మల్‌లో 'బాల భీముడు'.. ఐదున్నర కిలోలతో జననం
Follow us

|

Updated on: Jun 24, 2020 | 5:15 PM

నిర్మల్ జిల్లాలో ఓ మహిళకు మంగళవారం జరిగిన ప్రసవంలో ఐదున్నర కిలోలు ఉన్న బాల భీముడు జన్మించాడు. అత‌డిని చూసి ఆశ్చ‌ర్య‌పోయిన వైద్యులు… ఇది చాలా అరుదైన ఘటనగా అభివ‌ర్ణించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డా ఆరోగ్యంగా ఉన్న‌ట్లు తెలిపారు. బొద్దుగా ఉన్న ఆ పండంటి బిడ్డ‌ని చూసి కుటుంబ సభ్యులు కూడా తెగ మురిసిపోతున్నారు. త‌మ ఇంటి ‘బాల భీముడు’ అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

సోన్‌ మండలం లెఫ్ట్‌పోచంపాడ్‌కు చెందిన నేహా అనే మ‌హిళ‌ ఇటీవల పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చింది. సాధారణ కాన్పు కుద‌ర‌క‌పోవడంతో సిజేరియ‌న్ చేసి బిడ్డను బయటకు తీశారు వైద్యులు. మాములుగా అయితే అప్పుడే పుట్టిన శిశువు రెండున్నర నుంచి మూడు కిలోల బ‌రువు ఉండ‌టం కామ‌న్. కానీ ఆ బాలుడు మాత్రం 5.5 కేజీల బరువు ఉండ‌టం విశేషం. ఈ సంఘటన స్థానిక ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఈ నెల ప్రారంభంలో, భద్రాచలంకు చెందిన ఒక మహిళ సిజేరియన్ ద్వారా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 5.5 కిలోల బరువుతో ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లోని నీలౌఫర్ ఆసుపత్రిలో నవజాత శిశువు 6 కిలోలు బ‌రువుతో తెలంగాణ‌లో రికార్డు క్రియేట్ చేసింది. భద్రాచలం, నిర్మల్ లో జన్మించిన శిశువులు అధిక బ‌రువుతో విష‌యంలో సెకండ్ ప్లేసులో ఉన్నారు.