ఆదాయమే లక్ష్యంగా.. తెలంగాణలో మరో రెండు టోల్‌ప్లాజాలు..

| Edited By:

Jul 01, 2020 | 6:56 AM

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) టోల్ ప్లాజా నెట్‌వర్క్ ను రాష్ట్రంలో విస్తరిస్తోంది. తెలంగాణాలో మరో రెండు టోల్‌ప్లాజాలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై

ఆదాయమే లక్ష్యంగా.. తెలంగాణలో మరో రెండు టోల్‌ప్లాజాలు..
Follow us on

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) టోల్ ప్లాజా నెట్‌వర్క్ ను రాష్ట్రంలో విస్తరిస్తోంది. తెలంగాణాలో మరో రెండు టోల్‌ప్లాజాలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై స్టేషన్ ఘన్‌పూర్ వద్ద ఒకటి, వరంగల్ బైపాస్ వద్ద మరొకటి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ వరకు ఈ రెండు టోల్‌ప్లాజాల నిర్మాణం పూర్తి కానుండగా, ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే వాహనదారుల నుంచి టోల్ ఫీజు వసూలు చేయనున్నారు. ఈ రెండు టోల్‌ప్లాజాలతో కలిపి రాష్ట్రం మొత్తం టోల్‌ప్లాజాల సంఖ్య 20కి చేరనుంది.

లాక్‌డౌన్ క్రమంలో టోల్‌ప్లాజాల ఆదాయం భారీగా పడిపోయింది. సాధారణంగా రాష్ట్రంలోని 18 టోల్ ప్లాజాలు కలిపి నెలకు రూ.80 కోట్ల నుంచి 90 కోట్ల టోల్ వసూలు చేస్తాయి. మే నెలలో టోల్ వసూలు రూ.59.15 కోట్లకు, జూన్ మొదటి వారంలో రూ.18.08 కోట్లకు మెరుగుపడింది. వాహనాల కదలిక పెరిగినందున టోల్ వసూళ్లలో స్వల్ప మెరుగుదల ఉందని, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు.