ఆన్లైన్ తరగతులకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్..

కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైనా విద్యా సంవత్సరాన్ని(2020-21) ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో...

ఆన్లైన్ తరగతులకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్..
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 25, 2020 | 1:08 AM

Telangana Online Classes: కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైనా విద్యా సంవత్సరాన్ని(2020-21) ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో టీశాట్, దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు క్లాసులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కాగా, ఉపాధ్యాయులు ఈ నెల 27 నుంచి పాఠశాలలకు హాజరు కావాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే అన్ లాక్ 4.0లో విద్యాసంస్థలకు కేంద్రం అనుమతిచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Also Read: బాలకృష్ణ గొప్ప మనసు.. కోవిడ్ ఆసుపత్రికి భారీ విరాళం..

అటు ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9 నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష జరుగుతుందని.. అలాగే ఈ నెల 31న ఈసెట్, సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష సెప్టెంబర్ 28,29 తేదీల్లో జరగనుంది. అటు సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న టీఎస్ ఐసెట్, అక్టోబర్ 1 నుంచి 3వ తేదీ వరకు ఎడ్‌సెట్, అక్టోబర్ 4న లాసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

Also Read: ఢిల్లీ టూ లండన్.. బస్సులో అడ్వెంచర్ జర్నీ..