ఓటేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..

| Edited By:

May 10, 2019 | 12:48 PM

తెలంగాణ స్థానిక ఎన్నికల రెండో విడత పోరుకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా.. ఆయా నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి త‌న స్వ‌గ్రామం ఎల్ల‌ప‌ల్లిలో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఓటు వేశారు. మంత్రి వెంట ఆయన కుమారుడు అల్లోల గౌతమ్ రెడ్డి, సోదరుడు అల్లోల మురళీధర్ రెడ్డి, ఇతర టీఆరెస్ […]

ఓటేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..
Follow us on

తెలంగాణ స్థానిక ఎన్నికల రెండో విడత పోరుకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా.. ఆయా నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి త‌న స్వ‌గ్రామం ఎల్ల‌ప‌ల్లిలో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఓటు వేశారు. మంత్రి వెంట ఆయన కుమారుడు అల్లోల గౌతమ్ రెడ్డి, సోదరుడు అల్లోల మురళీధర్ రెడ్డి, ఇతర టీఆరెస్ నాయకులు ఉన్నారు. మేడ్చల్ మినహా అన్ని జిల్లాల్లోనూ పోలింగ్ జరగనుంది. రెండో దశలో మొత్తం 1,913 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వాటిలో 63 ఏకగ్రీవమయ్యాయి. మావోయిస్టుల ప్రభావం ఉన్నట్లుగా గుర్తించిన 218 స్థానాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది.