తెలంగాణలో జనవరి 2 నుంచి జూనియర్ కాలేజీల రీ-ఓపెన్.? ప్రణాళికలు సిద్ధం చేసిన విద్యాశాఖ.!!

తెలంగాణలో ఇంటర్ కాలేజీలు తెరిచేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. జనవరి 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్...

తెలంగాణలో జనవరి 2 నుంచి జూనియర్ కాలేజీల రీ-ఓపెన్.? ప్రణాళికలు సిద్ధం చేసిన విద్యాశాఖ.!!

Updated on: Dec 18, 2020 | 6:37 PM

Telangana Junior Colleges Re-Open: తెలంగాణలో ఇంటర్ కాలేజీలు తెరిచేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. జనవరి 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కళాశాలలను తెరవాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. వాటిపై సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది.

ఇటీవల కేంద్ర విద్యాశాఖ జేఈఈ మెయిన్ తేదీలను వెల్లడించడంతో.. విద్యార్థులకు కనీసం మూడు నెలల పాటు బోధన తప్పనిసరిగా ఉండాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ కాలేజీలను పున: ప్రారంభించేందుకు పలు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌లో వెసులుబాటుతో పాటు.. ప్రశ్నాపత్రాల్లో ఛాయిస్ క్వశ్చన్లు పెంచాలని నిర్ణయించారు.

కాగా, కొద్దిరోజుల ముందు అన్ని జిల్లాల ఇంటర్ విద్యాశాఖ అధికారులతో సమావేశమైన ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ జలీల్ పలు కీలక అంశాలపై చర్చించారు. ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణ, అటెండెన్స్ వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల సమయంలో భౌతిక దూరం తప్పనిసరి కాబట్టి.. అందుకు కావాల్సిన వసతులపై పూర్తి నివేదికను ఇవ్వాలని సూచించారు.

Also Read:

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి ఉచిత బస్సు పాసులు..

‘చాయ్’ ప్రియులకు అలెర్ట్.. పేపర్ కప్పుల్లో తాగుతున్నారా.! ఆరోగ్యానికి ఇబ్బందేనంటున్న పరిశోధకులు..

‘మాస్టర్’ తెలుగు టీజర్ వచ్చేసింది.. విజయ్ స్క్వేర్ ఫైట్ సీన్స్ ఫ్యాన్స్‌కు పండగే..

విద్యార్థులకు మోదీ సర్కార్ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా.? వైరల్ అవుతున్న మెసేజ్.. వివరణ ఇచ్చిన కేంద్రం..