ఆన్‌లైన్‌ క్లాసులు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం : హైకోర్టు

|

Aug 06, 2020 | 3:47 PM

ఆన్‌లైన్‌ క్లాసులు పిల్లలపై మానసిక, శారీరక ప్రభావం చూపుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. అటు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆన్‌లైన్‌ తరగతులు నిషేధించాలని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ వేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

ఆన్‌లైన్‌ క్లాసులు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం : హైకోర్టు
Follow us on

ఆన్‌లైన్‌ క్లాసులు పిల్లలపై మానసిక, శారీరక ప్రభావం చూపుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. అటు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆన్‌లైన్‌ తరగతులు నిషేధించాలని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ వేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యాసంవత్సర విధివిధానాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కోర్టు. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు గంటల తరబడి ఆన్ లైన్ పాఠాలు చెబుతున్నాయని – ఐదో తరగతి లోపు విద్యార్థులు అంతసేపు ఆన్ లైన్‌లో ఎలా ఉండగలరని ప్రశ్నించింది. పిల్లలపై మానసిక, శారీరక ప్రభావం చూపుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఆన్‌లైన్‌ తరగతులు, విధివిధానాలు ఇప్పటికే రూపకల్పన చేశామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రైవేట్ పాఠశాలలు పాటించాల్సిన నిబంధనలు కూడా ప్రకటిస్తామని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర విద్యా శాఖ పరిధిలోని పాఠశాలలకే వర్తిస్తుందా అని హైకోర్టు ప్రశ్నించింది. అటు ఆన్ లైన్ తరగతులపై వైఖరి వెల్లడించేందుకు 10 రోజుల సమయం కావాలని సీబీఎస్ఈ కోరింది. ఫీజులు వసూలు చేయ వద్దన్న జీవోను పాఠాశాలులు ఉల్లంఘిస్తున్నాయన్న పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అధిక ఫీజులు వసూలు చేస్తే తిరిగి ఇప్పించే అధికారం తమకుందని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.