Breaking: ఈ నెల 29వ తేదీన ధరణి పోర్టల్ ప్రారంభం..

ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ధరణి పోర్టల్ ప్రారంభించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా దసరా పండుగ రోజున ధరణి పోర్టల్‌ను...

Breaking: ఈ నెల 29వ తేదీన ధరణి పోర్టల్ ప్రారంభం..

Updated on: Oct 23, 2020 | 7:34 PM

Dharani Portal On October 29: ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ధరణి పోర్టల్ ప్రారంభించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా దసరా పండుగ రోజున ధరణి పోర్టల్‌ను ప్రారంభించాలని భావించినా.. పోర్టల్ టెస్ట్ రన్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అది కాస్తా వాయిదా వేశారు. అటు దసరాలోగా అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటాను ధరణి పోర్టల్‌లో ఎంటర్ చేయాలని అధికారులను ఆదేశించినా.. ఇంకా నమోదు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.

వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లను ధరణి పోర్టల్‌ ద్వారానే జరపాలని గవర్నమెంట్ ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈనెల 29న పోర్టల్‌ను ప్రారంభించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తిరిగి స్టార్ట్ కానుంది. వ్యవసాయ ఆస్తులకు తహసీల్దార్లు, వ్యవసాయేతర ఆస్తులకు సబ్‌రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు.

Also Read: పుట్టగొడుగులతో కరోనా ఖతం.. సీసీఎంబీ కీలక పరిశోధన.!