ముంబై సారథి రోహిత్ ఎందుకు ఆడటం లేదంటే..

తప్పని సరిగా గెలవార్సిన పోరులో ముంబై జట్టు సారథి రోహిత్ శర్మ లేకుండానే బరిలోకి దిగుతోంది. ఐపీఎల్‌-13లో భాగంగా షార్జా వేదికగా జరుగుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడుతోంది.

  • Sanjay Kasula
  • Publish Date - 7:35 pm, Fri, 23 October 20
ముంబై సారథి రోహిత్ ఎందుకు ఆడటం లేదంటే..

Rohit Sharma is Set to Sit Out : తప్పని సరిగా గెలవాల్సిన పోరులో సారథి రోహిత్ శర్మ లేకుండానే ముంబై జట్టు బరిలోకి దిగుతోంది. ఐపీఎల్‌-13లో భాగంగా షార్జా వేదికగా జరుగుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడుతోంది.

ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య ఓ మ్యాచ్ జరగ్గా ముంబైపై చెన్నై గెలిచింది. ఐపీఎల్‌-13వ సీజన్‌ను చెన్నై ఈ విజయంతో ఆరంభించింది. ఆరంభ పోరులో ధోనీసేన 5 వికెట్ల తేడాతో రోహిత్‌సేనపై నెగ్గింది. అప్పటికీ.. ఇప్పటికీ రెండు జట్ల ప్రదర్శనలో చాలా మార్పులు వచ్చాయి. ముంబై ప్లేఆఫ్స్‌కు చేరువలో ఉంటే..చెన్నై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది.

అయితే ఈ సమయంలో కీలకమైన ఆటగాడు.. ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ముంబై తాత్కాలిక సారథిగా పొలార్డ్‌  వ్యవహరించనున్నాడు.