తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెల్..

| Edited By: Pardhasaradhi Peri

Aug 08, 2020 | 3:57 PM

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రజల సౌకర్యం కోసం త్వరలోనే ఫిర్యాదుల కేంద్రం ఒకటి ఏర్పాటు చేయనుంది.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెల్..
Follow us on

Telangana Government Key Decision: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రజల సౌకర్యం కోసం త్వరలోనే ఫిర్యాదుల కేంద్రం ఒకటి ఏర్పాటు చేయనుంది. అన్ని రకాల కంప్లైంట్స్ సులభంగా పరిష్కారం అయ్యేలా ఒకే వేదికను ఏర్పాటు చేయడానికి సన్నద్ధం అవుతోంది. వాట్సప్, ఫోన్, మెసేజ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులన్నీ ఒకే చోటుకు చేరేలా అధికారులు ప్రణాళికలు రూపొందుస్తున్నారు.

ఇకపై ప్రజల అర్జీలు ఏ రూపంలో వచ్చినా ఒకే సిస్టం ద్వారా పరిష్కారం చేయనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ కూడా ఉండనుంది. ఫిర్యాదుదారులకు ఫోన్ చేసి, సమస్య పరిష్కారమైందో.? లేదో.? ఈ కాల్ సెంటర్ ద్వారా వాకబు చేస్తారు. ఈ గ్రీవెన్సు రిడ్రెసల్ సిస్టం కోసం రాష్ట్ర ఐటీశాఖ టెండర్లను పిలిచింది. రాబోయే రెండు నెలల్లో ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ప్రతీ ఫిర్యాదును ఉన్నతాధికారులు పరిశీలించే వెసులుబాటు కూడా కలుగుతుంది.

Also Read: ఏపీ వచ్చే విదేశీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. క్వారంటైన్ నుంచి మినహాయింపు!