తెలంగాణలో వేసవి సెలవులు ఎప్పటినుండి అంటే…

హైదరాబాద్ : తెలంగాణ విద్యా శాఖ వేసవి సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు రేపటి నుంచి మే 31 వరకూ సెలవులని పేర్కొంది. ఈ 50 రోజులూ అన్ని పాఠశాలలను విధిగా మూసివేయాలని ఆదేశించింది. ఇంటర్‌లోకి ప్రవేశిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక క్లాసుల పేరిట ఎవరైనా తరగతులు నిర్వహిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, పలు ప్రముఖ విద్యా సంస్థలు ఇంటర్ ప్రవేశం కోరుతున్న విద్యార్థులకు ముందుగానే క్లాసులు నిర్వహించేందుకు ఏర్పాట్లు […]

తెలంగాణలో వేసవి సెలవులు ఎప్పటినుండి అంటే...

Edited By:

Updated on: Apr 12, 2019 | 1:52 PM

హైదరాబాద్ : తెలంగాణ విద్యా శాఖ వేసవి సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు రేపటి నుంచి మే 31 వరకూ సెలవులని పేర్కొంది. ఈ 50 రోజులూ అన్ని పాఠశాలలను విధిగా మూసివేయాలని ఆదేశించింది. ఇంటర్‌లోకి ప్రవేశిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక క్లాసుల పేరిట ఎవరైనా తరగతులు నిర్వహిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, పలు ప్రముఖ విద్యా సంస్థలు ఇంటర్ ప్రవేశం కోరుతున్న విద్యార్థులకు ముందుగానే క్లాసులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది.