రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంసెట్ పరీక్ష నిర్వహణకు పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఎంసెట్ ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులకు కొత్త రూల్ పెట్టింది. పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లే ముందు ”తనకు కరోనా పాజిటివ్ లేదని.. తనలో కరోనా లక్షణాలు లేవని” ప్రతీ విద్యార్థి సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం ఇవ్వడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని అధికారులు ఎంసెట్ వెబ్‌సైట్‌లో ఉంచారు.
ఇదిలా ఉంటే పరీక్షకు హాజరయ్యే ప్రతీ విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. ఒకవేళ ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వారిని ప్రత్యేక గదిలో ఉంచి ఎగ్జామ్ రాసేలా చర్యలు తీసుకుంటారు. ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి అనే నిబంధనను సడలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కంప్యూటర్‌కు కీ-బోర్డు ఉండదని.. ఈసారి అభ్యర్థులు ఎగ్జామ్ రాసేందుకు కేవలం మౌస్ మాత్రమే ఉపయోగించాలన్నారు. ఇక రాష్ట్రంలో సుమారు 6,093 మంది విద్యార్థులు తమ స్వస్థలాల దగ్గరకు ఎగ్జామ్ సెంటర్లను మార్చుకున్నారు.
ఇది చదవండి: అన్‌లాక్ 2.0కు కేంద్రం రంగం సిద్ధం.. వాటికి మాత్రం అనుమతి లేదు.!