Telangana Crime News: మద్యం మత్తులో స్నేహితుల మధ్యన ఘర్షణ.. కత్తితో దాడి చేసి హత్య చేసిన స్నేహితుడు

Telangana Crime News: మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ. మాట మాట పెరిగి స్నేహితుడి పై కత్తితో దాడి చేసి బండ రాయి తో మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దారుణ సంఘటన సైబరాబాద్ కమిషనరేట్..

Telangana Crime News: మద్యం మత్తులో స్నేహితుల మధ్యన ఘర్షణ.. కత్తితో దాడి చేసి హత్య చేసిన స్నేహితుడు
Crime News

Updated on: Aug 27, 2021 | 7:28 AM

Telangana Crime News: మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ. మాట మాట పెరిగి స్నేహితుడి పై కత్తితో దాడి చేసి బండ రాయి తో మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దారుణ సంఘటన సైబరాబాద్ కమిషనరేట్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ పి అండ్ టి కాలనీ లో చోటు చేసుకుంది.

స్నేహితుడిపై దాడి చేసిన అనంతరం నిందితుడు ఖురేషీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సరెండర్ అయ్యాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బండ్లగూడ పి అండ్ టి కాలనీకి చెందిన సయ్యద్ హమీద్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. అదే కాలనీకి చెంది లేబర్ గా పనిచేస్తున్న ఖురేషి తో హమీద్ కు స్నేహం ఏర్పడింది. హమీద్, ఖురేషి లు ప్రతిరోజు సాయంత్రం మద్యం సేవిస్తూ ఉంటారు. అదే మాదిరిగా ఈరోజు కూడా ఇద్దరు కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఆ ఘర్షణ లోని హమీద్ ను ఖురేషీ తనవద్దనున్న కత్తితో పొడవడంతో పాటు పక్కనే ఉన్న బండరాయితో మొదడంతో తీవ్రంగా గాయపడిన హమీద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ వెంటనే ఖురేషి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సరెండర్ అయ్యాడు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

Also Read: Collector Bungalow: జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజ్‌కు తప్పిన పెను ప్రమాదం.. బంగ్లాపై కప్పు కూలిన వైనం..

Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే