రాష్ట్రంలో కొత్తగా 1,504 మందికి కరోనా పాజిటివ్‌

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్ర కాస్త తగ్గుముఖం పడుతుంది. అయినప్పటికీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచిస్తుంది

రాష్ట్రంలో కొత్తగా 1,504 మందికి కరోనా పాజిటివ్‌
Follow us

|

Updated on: Oct 29, 2020 | 9:21 AM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్ర కాస్త తగ్గుముఖం పడుతుంది. అయినప్పటికీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచిస్తుంది. సీజనల్ వ్యాధుల రూపంలో కరోనా వ్యాప్తి చెందే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాగా, గడిచిన 24 గంటల వ్యవధిలో మంగళవారం రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకు 41,962 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,504 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,35,656కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం వెల్లడించింది.

ఇక, నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,324కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,436 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,16,353కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,979 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 14,938 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న ఒక్క రోజే 288 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 41,96,958కి చేరింది. శీతకాలం సమీపించడంలో వ్యాధులు వ్యాపించే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?