Breaking: తెలంగాణలో కొత్తగా 1,430 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వికృత రూపం కొనసాగుతూనే ఉంది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా1,430 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.

Breaking: తెలంగాణలో కొత్తగా 1,430 కరోనా కేసులు

Updated on: Jul 21, 2020 | 10:14 PM

తెలంగాణలో కరోనా వికృత రూపం కొనసాగుతూనే ఉంది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా1,430 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 703 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 47,705 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వైరస్‌ బారినపడి ఇవాళ ఏడుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 429 మంది కరోనాతో ప్రాణాలొదిలారు. మంగళవారం రాష్ట్రంలో పలు ఆస్పత్రుల నుంచి 2,062 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో మొత్తంగా 36,385 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 10,891మంది రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం 16,855మందికి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా, ఇప్పటి వరకు 2,76,222 మందికి టెస్టులు చేసినట్లు తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.