Telangana Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 574 వైరస్ పాజిటివ్ కేసులు..యాక్టీవ్ కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి..

తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా చేసిన  నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 574 మందికి పాజిటివ్ అని తేలింది.  ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,83,556కి చేరింది.

Telangana Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 574 వైరస్ పాజిటివ్ కేసులు..యాక్టీవ్ కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి..
Covid-19 cases

Updated on: Dec 24, 2020 | 10:35 AM

తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా చేసిన  నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 574 మందికి పాజిటివ్ అని తేలింది.  ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,83,556కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. బుధవారం కరోనా కారణంగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,524కి చేరింది. కొత్తగా 384 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,75,217కు చేరింది.  జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 109 కరోనా కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 6,815 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 4,487 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు.

 

Also Read :

New virus strain : రాజమండ్రిలో కొత్త రకం కరోనా వైరస్ కలకలం..యూకే నుంచి వచ్చిన మహిళకు వైరస్ పాజిటివ్

రూ. లక్షల డబ్బు ఉన్న సంచి లాక్కుని కోతి పరార్..కన్నీరుమున్నీరయిన వృద్ధుడు. చివరకు ఏం జరిగిందంటే..?

Survey training institute : తిరుపతిలో సర్వే శిక్షణ సంస్థ ఏర్పాటుకు భూమి కేటాయింపు…అర్బన్ మండలంలోని ఆ గ్రామంలో