Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 249 పాజిటివ్‌ కేసులు..యాక్టీవ్ కేసులు, మరణాలు వివరాలు ఇలా

|

Jan 16, 2021 | 11:41 AM

తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 28,953 కరోనా టెస్టులు చేయగా  249 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,91,367కి చేరింది.

Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 249 పాజిటివ్‌ కేసులు..యాక్టీవ్ కేసులు, మరణాలు వివరాలు ఇలా
Follow us on

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 28,953 కరోనా టెస్టులు చేయగా  249 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,91,367కి చేరింది. కొత్తగా వైరస్ కారణంగా ఒకరు ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 1,575కి చేరింది. కరోనాబారి నుంచి తాజాగా 417 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రికవరీల సంఖ్య 2,85,519కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,273 ఉండగా వీరిలో 2,381 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు  వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం రిలీజ్ చేసిన బులిటెన్‌లో తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 74,28,389కి చేరింది.

ఇక దేశ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నేడు ప్రారంభమైంది. తెలంగాణలోని గాంధీ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ పంపిణీని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. వ్యాక్సిన్‌ పంపిణీకి ముందు ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని వారంతా విన్నారు.  హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో పనిచేసే సఫాయి కార్మికురాలు కృషమ్మ రాష్ట్రంలో మొదటి వ్యాక్సిన్ తీసుకున్నారు.

Also Read: Corona Vaccine: తిరుపతి రుయా ఆసుపత్రిలో విచిత్ర పరిస్థితి.. వ్యాక్సిన్ కోసం ఇంతవరకూ ముందుకు రాని సిబ్బంది