
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 499 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 6,526కి చేరింది. ఇందులో 2,976 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,352 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 198 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు ఇవాళ కరోనాతో ముగ్గురు మరణించగా.. 51 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క గ్రేటర్ పరిధిలోనే 329 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డిలో 129 కేసులు, మేడ్చల్ 4, మంచిర్యాల 4, సంగారెడ్డి 1, మహబూబ్ నగర్ 6, ఖమ్మం 2, సూర్యాపేట 2, నల్గొండ 4, నిజామాబాద్ 4, కరీంనగర్ 1, జగిత్యాల 1, వరంగల్ అర్బన్ 4, జనగాంలో 7 కేసులు నమోదయ్యాయి. అటు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 2,477 కరోనా టెస్టులు చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీనితో మొత్తంగా కరోనా టెస్టుల సంఖ్య 50,569కి చేరుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 8 ప్రైవేట్ ల్యాబ్స్ లలో టెస్టులు నిర్వహిస్తుండగా.. అందులో 8 ల్యాబ్స్ హైదరాబాద్ లోనే ఉన్నాయి.