Telangana Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 551 వైరస్ పాజిటివ్ కేసులు..యాక్టీవ్ కేసుల సంఖ్య ఎంతంటే..?

|

Dec 18, 2020 | 10:20 AM

తెలంగాణ కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా47,991 కరోనా టెస్టులు చేయగా.. 551 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...

Telangana Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 551 వైరస్ పాజిటివ్ కేసులు..యాక్టీవ్ కేసుల సంఖ్య ఎంతంటే..?
Follow us on

తెలంగాణ కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా47,991 కరోనా టెస్టులు చేయగా.. 551 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,80,195కు చేరింది. గురువారం కరోనాతో ఒక వ్యక్తి మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,506కి చేరింది. వ్యాధి బారి నుంచి గురువారం రోజే 682 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 2,71,649కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,040 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌‌లో తెలిపింది. వారిలో 4,955 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 63,54,388కి చేరింది.

 

Also Read : 

ఇతడేం భర్త… ఆవేశంలో కిరోసిన్ పోసుకున్న భార్యకు అగ్గిపెట్టె ఇచ్చాడు…ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు