Telangana Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 298 వైరస్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 298 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 2,89,433కు చేరింది.

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 298 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 2,89,433కు చేరింది. కొత్తగా ఈ మహమ్మారి కారంణంగా ఇద్దరు ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 1,563కు చేరింది. కరోనా నుంచి మరో 474 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం రికవరీల సంఖ్య 2,83,048కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,822 కరోనా యాక్టివ్ కేసులుండగా.. 2,614 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ శనివారం రిలీజ్ చేసిన బులిటెన్‌లో తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 61 కరోనా కేసులు వెలుగుచూశాయి.
పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ..జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.
Also Read : బిగ్ బ్రేకింగ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమన్లు జారీ చేసిన ఈడీ కోర్టు