AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాసేపట్లో యాదాద్రికి సీఎం కేసీఆర్

తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సందర్శించనున్నారు.

కాసేపట్లో యాదాద్రికి సీఎం కేసీఆర్
Balaraju Goud
|

Updated on: Sep 13, 2020 | 9:19 AM

Share

తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సందర్శించనున్నారు. ఐదేళ్ల క్రితం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి నిర్మాణ తీరును ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రికి రావడం ఇది 13వ సారి. ఆదివారం ఉదయం యాదాద్రి కొండపైకి చేరుకొని తొలుత బాలాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కొండపై ప్రధానాలయాల పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు.

దేశంలో అత్యంత సుప్రసిద్ధ ఆలయంగా యాదాద్రి నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందులో భాగంగా ఆలయాన్ని అద్భుత రాతి కట్టడంగా అపురూప శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. యాదాద్రి కొండకు నలు దిక్కుల ఉన్న కొండలను ఆలయానికి అనుగుణంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని సందర్శనున్నారు. ఆలయ పరిసరాలు, భక్తులకు మౌలిక సదుపాయాలతో పాటు కొండకింద రహదారుల అభివృద్ధి, వసతి సదుపాయాల కల్పన, పచ్చదనానికి అనుగుణం మొక్కల పెంపకం, నీటి కొలను నిర్మాణం వంటి అంశాలపై సీఎం కేసీఆర్‌ పర్యటనలో దృష్టి సారించే అవకాశాలున్నాయి.

ఆలయ ఉద్ఘాటన సందర్భంగా నిర్వహించనున్న మహాసుదర్శన యాగం ఏర్పాట్లను కూడా సీఎం పరిశీలించనున్నట్లు సమాచారం. నిర్దేశిత గడువులోగా పనులు సంపూర్ణం చేసేందుకు తన పర్యటనలో అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు సీఎం రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొమ్మిదిమాసాల తర్వాత వస్తుండటంతో పనుల పురోగతిని ఆయనకు వివరించేందుకు వైటీడీఏ, ఆర్‌అండ్‌బీ అధికారులు, స్థపతులు అంతర్గత సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌, రాచకొండ కమిషనరేట్‌ భువనగిరి జోన్‌ డీసీపీ కె.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు.

Follow Us
ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..
ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..
ఎముకల బలానికి సంజీవని నల్లేరు..కీళ్ల నొప్పుల నుంచి జీర్ణ సమస్యలకు
ఎముకల బలానికి సంజీవని నల్లేరు..కీళ్ల నొప్పుల నుంచి జీర్ణ సమస్యలకు
దారుణం.. బిల్లు కట్టలేదని మహిళకు గుండు కొట్టిన బార్ సిబ్బంది
దారుణం.. బిల్లు కట్టలేదని మహిళకు గుండు కొట్టిన బార్ సిబ్బంది
మీ రక్తాన్ని పీల్చే దోమ ఏదో మీకు తెలుసా..? 99శాతం మందికి..
మీ రక్తాన్ని పీల్చే దోమ ఏదో మీకు తెలుసా..? 99శాతం మందికి..
8 ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా.
8 ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా.
మందార పువ్వులతో ఫేస్ జెల్.. మచ్చలేని, కాంతివంతమైన చర్మం కోసం
మందార పువ్వులతో ఫేస్ జెల్.. మచ్చలేని, కాంతివంతమైన చర్మం కోసం
ఇవాళే భారత్ vs హాంకాంగ్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి..?
ఇవాళే భారత్ vs హాంకాంగ్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి..?
వాస్తు టిప్స్ : మీ పర్సులో ఈ వస్తువులు ఉంటే అప్పుల బాధలు తప్పవు
వాస్తు టిప్స్ : మీ పర్సులో ఈ వస్తువులు ఉంటే అప్పుల బాధలు తప్పవు
వెయ్యికే సూపర్ ట్రిప్.. ఒక్క రోజులోనే సాగర్ అందాలు, బౌద్ధ చరిత్ర
వెయ్యికే సూపర్ ట్రిప్.. ఒక్క రోజులోనే సాగర్ అందాలు, బౌద్ధ చరిత్ర
దంతాల మీద పాచి, గారె ఇట్టే తొలగించే ఏఐ టూత్‌బ్రష్‌!
దంతాల మీద పాచి, గారె ఇట్టే తొలగించే ఏఐ టూత్‌బ్రష్‌!