తమిళి సైకు కేసీఆర్ అభినందనలు.. సాదర ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళి సై సౌందర రాజన్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఆమెను తెలంగాణ రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ గవర్నర్‌గా సౌందర్ రాజన్‌ను నియమిస్తూ.. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత సీఎం కేసీఆర్ ఆమెకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గవర్నర్‌గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తోన్న నరసింహన్‌‌ను కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్ భవన్ వెళ్లిన ఆయన నరసింహన్‌తో సమావేశమయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయకు కూడా […]

తమిళి సైకు కేసీఆర్ అభినందనలు.. సాదర ఆహ్వానం

Edited By:

Updated on: Sep 01, 2019 | 11:30 PM

తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళి సై సౌందర రాజన్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఆమెను తెలంగాణ రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ గవర్నర్‌గా సౌందర్ రాజన్‌ను నియమిస్తూ.. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత సీఎం కేసీఆర్ ఆమెకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గవర్నర్‌గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తోన్న నరసింహన్‌‌ను కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్ భవన్ వెళ్లిన ఆయన నరసింహన్‌తో సమావేశమయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ గవర్నర్‌గా రాబోతున్న తమిళి సై సౌందర్ రాజన్‌కు టీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. హిమాచల్ గవర్నర్‌గా నియమితులైన దత్తాత్రేయకు ఆయన కంగ్రాట్స్ చెప్పారు. సుదీర్ఘ కాలంపాటు తెలంగాణకు గవర్నర్‌గా పని చేసిన నరసింహన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.